MAA Crisis: నా రాజీనామా తిరిగి తీసుకుంటాను.. అలా అయితేనే అంటున్న ప్రకాష్ రాజ్

|

Oct 12, 2021 | 6:18 PM

మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పానెల్ తరుపున గెలిచిన అందరూ రాజీనామాలు చేశారు.

MAA Crisis: నా రాజీనామా తిరిగి తీసుకుంటాను.. అలా అయితేనే అంటున్న ప్రకాష్ రాజ్
Prakash Raj Vs Manchu Vishnu Maa Elections
Follow us on

మా ఎన్నికలు తెచ్చిన సంక్షోభం కొత్త కోణం తీసుకుంది. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పానెల్ తరుపున గెలిచిన అందరూ రాజీనామాలు చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

”మా ఎన్నికల్లో చాలా రౌడీయిజం చేశారు. నరేష్ ప్రవర్తన సరిలేదు. సగం సగం కార్యవర్గం వలన ఉపయోగం లేదు. మా సంక్షేమం కోసం ఎంతో అలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం.  మంచు విష్ణు ఎన్నో హామీలు ఇచ్చారు. సంక్షేమం విషయంలో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అందుకోసమే ఒక డీసెంట్ డెసిషన్ తీసుకున్నాం.  మీకు అడ్డురాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం” అంటూ  ప్రకాష్ రాజ్ చెప్పారు.

ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండోరోజు ఓడిపోయారు అసలు ఏమిటిదంతా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని, పోస్టల్‌ బ్యాలెట్స్‌లో అన్యాయం జరిగింది.. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

”ఎన్నికలు అయిన వెంటనే నేను మా ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. అయితే, మంచు విష్ణు ఆ రాజీనామా ఆమోదించలేదు. నేను అసోసియేషన్ లో తిరిగి ఉండాలని అన్నారు.”

”నేను కచ్చితంగా నా రాజీనామా వెనక్కి తీసుకుంటాను. కానీ, నాది ఒక కండిషన్ ఉంది. అది ఏమిటి అంటే.. నాన్ లోకల్ అనే పదాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎన్నికల్లో ఓటు వేయడానికో.. మరో విధంగా చేయడానికో నేను మాలో కొనసాగలేను. మా బైలాస్ లో మార్పు తీసుకువస్తే నాకు ఇందులో కొనసాగటానికి సిద్ధంగా ఉన్నాను” అంటూ ప్రకాష్ రాజ్ చెప్పారు.