Love Story Movie: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, ఫిదా భామ సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఈ సినిమా విడుదల వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తోంది. ఇదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అన్నారే తప్పా పక్కా క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. తాజాగా ఈ చిత్రయూనిట్ ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఈ నెల 24న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నట్లు సస్పెన్స్‌కి తెరదించింది.
అందమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్, పాటలు మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. దీంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాను మొదటగా వినాయక చవితి సందర్భంగా విడుదల చేయాలనీ భావించారు. కానీ ఇదే రోజు నాని నటించిన టక్ జగదీష్ సినిమా ఓటీటీ వేదికగా విడుదలవుతుండటంతో వాయిదా వేశారు. ఈ విషయం పై నిర్మాతలకు- థియేటర్స్ యజమానులకు మధ్య చర్చ కూడా జరిగింది. దీంతో లవ్ స్టోరీ సినిమా వెనక్కు తగ్గింది.
ఈ సినిమాలో ఇద్దరు డ్యాన్సర్ల జీవన శైలిని చూపించనున్నారు. చైతు, సాయిపల్లవి ఇద్దరు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ఈ సినిమాను సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నారాయణ దాస్ కె.నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ నిర్మాతలుగా ఉన్నారు. ఇక లవ్ స్టోరీలో హీరోగా నటించిన నాగ చైతన్య విషయానికొస్తే.. వరుసగా మజిలీ, వెంకీ మామ సక్సెస్‌లతో మంచి ఊపు మీదున్నాడు. ఇపుడు తన ఫ్యామిలీ ఇమేజ్‌కు తగ్గట్టు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తోన్నాడు.
#LoveStory Grand Theatrical Release On 24th September,2021#lovestoryfromsep24th@chay_akkineni @Sai_Pallavi92 @sekharkammula @pawanch19 @SVCLLP #amigoscreations @AsianSuniel @adityamusic @NiharikaGajula @GskMedia_PR pic.twitter.com/tr6bVBnZwv
— BA Raju’s Team (@baraju_SuperHit) September 10, 2021