Liger: షారుఖ్‌, కాజోల్‌లా మారిపోయిన విజయ్‌, అనన్య.. నెట్టింట్లో వైరలవుతోన్న లైగర్‌ జోడీ బ్యూటిఫుల్‌ పిక్స్‌

|

Aug 13, 2022 | 8:57 PM

Liger Fandom Tour: లైగర్‌ సినిమా విడుదలకు ముహూర్తం ముంచుకొస్తోంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది చిత్రబృందం. టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ, హీరోయిన్ అనన్యా పాండే ఇప్పటికే..

Liger: షారుఖ్‌, కాజోల్‌లా మారిపోయిన విజయ్‌, అనన్య.. నెట్టింట్లో వైరలవుతోన్న లైగర్‌ జోడీ బ్యూటిఫుల్‌ పిక్స్‌
Liger
Follow us on

Liger Fandom Tour: లైగర్‌ సినిమా విడుదలకు ముహూర్తం ముంచుకొస్తోంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను మరింత వేగవంతం చేసింది చిత్రబృందం. టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ, హీరోయిన్ అనన్యా పాండే ఇప్పటికే ముంబై, బిహార్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాలను చుట్టేశారు. తాజాగా ఈ చిత్రబృందం పంజాబ్‌లో పర్యటించింది. చండీగఢ్‌లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో లైగర్‌ నుంచి మూడో పాట కోకాకోకా సాంగ్‌ను విడుదల చేశారు. ఈకార్యక్రమంలో హీరోహీరోయిన్లతో పాటు డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ కూడా సందడి చేశారు. కాగా ఈ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో విజయ్‌, అనన్య సంప్రదాయ దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ప్రస్తుతం లైగర్‌ పంజాబ్‌ టూర్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.

ఆ సినిమాను గుర్తుకు తెస్తూ..

కాగా ఈవెంట్‌కు ముందు విజయ్‌, అనన్యలిద్దరూ చుట్టపక్కల ప్రాంతాల్లో ని పొలాల్లో కలియతిరిగారు. వివిధ రకాల స్టిల్స్‌తో ఫొటోలు దిగారు. కొన్ని ఫొటోల్లో విజయ్‌.. అనన్యను ఎత్తుకోగా.. మరికొన్ని చోట్ల వీరిద్దరూ కలిసి ట్రాక్టర్‌ నడుపుతున్నట్లు దర్శనమిచ్చారు. వీటికి సంబంధించిన ఫొటోలను విజయ్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ పంజాబ్‌ తనకెంతో నచ్చిందన్నాడు. కాగా వైరలవుతోన్న ఓ ఫొటోలను చూస్తోంటే షారుఖ్‌ ఖాన్‌ సూపర్‌ హిట్‌ మూవీ దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే గుర్తుకొస్తుందని ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు. ‘లైగర్‌ జోడీ సూపర్బ్‌గా ఉంది. క్యూట్‌ పెయిర్‌’ అంటూ ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ స్పోర్ట్స్‌ డ్రామా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..