Liger: అహ్మదాబాద్‌లో లైగర్‌ మాస్‌ మేనియా.. రౌడీ బాయ్‌ను చూసేందుకు ఎగబడిన ఫ్యాన్స్‌, ఫిల్మీ లవర్స్‌.. వీడియో వైరల్‌

Vijay Devarakonda Liger: టాలీవుడ్‌ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ (Liger). బాక్సింగ్ నేపథ్యంలో పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే (Ananya Panday)

Liger: అహ్మదాబాద్‌లో లైగర్‌ మాస్‌ మేనియా.. రౌడీ బాయ్‌ను చూసేందుకు ఎగబడిన ఫ్యాన్స్‌, ఫిల్మీ లవర్స్‌.. వీడియో వైరల్‌
Vijay Devarakonda Liger

Updated on: Aug 08, 2022 | 11:08 AM

Vijay Devarakonda Liger: టాలీవుడ్‌ రౌడీ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ (Liger). బాక్సింగ్ నేపథ్యంలో పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ అనన్యా పాండే (Ananya Panday) విజయ్‌తో రొమాన్స్‌ చేయనుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్‌, సాంగ్స్‌పై అంచనాలు పెంచేశాయి. ఈనేపథ్యంలో ఆగస్టు 25న విడుదలయ్యే ఈ స్పోర్ట్స్‌ డ్రామా మూవీ కోసం విజయ్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో తమ సినిమాను మరింతగా ప్రమోట్‌ చేసుకునే పనిలో తలమునకలయ్యాడు విజయ్‌. దేశంలోని ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ అక్కడి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నటికి మొన్న ముంబైలో అనన్య పాండేతో కలిసి విజయ్‌ సందడి చేయగా.. నిన్న బిహార్‌ రాజధాని పాట్నాలో నిర్వహించిన ఈవెంట్‌కు అక్కడి ప్రేక్షకుల నుంచి బ్రహ్మరథం పట్టారు.

తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ( Ahmedabad) ను విజిట్‌ చేశారు విజయ్‌, అనన్య. అక్కడి ఓ మాల్‌ లో నిర్వహించిన లైగర్‌ ప్రమోషన్‌ ఈవెంట్లో ఇద్దరూ హాజరయ్యారు. ఈ వేడుకకు అభిమానులు, సినీ లవర్స్‌ పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రాంగణమంతా ఫ్యాన్స్‌తో నిండిపోయింది. ఈ సందర్భంగా లైగర్‌ బాయ్‌ మాట్లాడుతున్నప్పుడు ఈలలు, కేకలతో హోరెత్తించారు అభిమానులు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ రమేష్‌ బాల సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. దీంతో ప్రస్తుతం ఇవి నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా ఇంతకుముందు ముంబై, పాట్నాలలో నిర్వహించిన ఈవెంట్లు కూడా జనసంద్రంతో నిండిపోయాయి. దీంతో క్రౌడ్ ను కంట్రోల్ చేయలేక ఈవెంట్స్ సైతం క్యాన్సిల్ చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..