Trishna Krishnan: త్రిషపై నటుడి వెకిలి వ్యాఖ్యలు.. కోలీవుడ్ స్టార్స్ ఫైర్.. ‘లియో’ డైరెక్టర్ సీరియస్ ట్వీట్..

|

Nov 19, 2023 | 3:26 PM

హీరోయిన్ త్రిష గురించి కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారాన్ని రేపుతున్నాయి. 'ఇటీవల త్రిష, విజయ్ కలిసి నటించిన లియో సినిమాలో తాను నటిస్తున్నాని తెలిసిందని.. దీంతో ఈ మూవీలో ఒక్క బెడ్ రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నాను.. త్రిషతో రేప్ సీన్ ఉంటుందని అనుకున్నాను.. కానీ కశ్మీర్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్ లో త్రిషను కనీసం నాకు చూపించలేదంటూ' కామెంట్స్ చేశాడు మన్సూర్ అలీఖాన్.

Trishna Krishnan: త్రిషపై నటుడి వెకిలి వ్యాఖ్యలు.. కోలీవుడ్ స్టార్స్ ఫైర్.. లియో డైరెక్టర్ సీరియస్ ట్వీట్..
Trishna, Lokesh Kanagaraj
Follow us on

హీరోయిన్ త్రిష గురించి కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట దుమారాన్ని రేపుతున్నాయి. ‘ఇటీవల త్రిష, విజయ్ కలిసి నటించిన లియో సినిమాలో తాను నటిస్తున్నాని తెలిసిందని.. దీంతో ఈ మూవీలో ఒక్క బెడ్ రూమ్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నాను.. త్రిషతో రేప్ సీన్ ఉంటుందని అనుకున్నాను.. కానీ కశ్మీర్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్ లో త్రిషను కనీసం నాకు చూపించలేదంటూ’ కామెంట్స్ చేశాడు మన్సూర్ అలీఖాన్. ఇప్పటికే అతడి వ్యాఖ్యలపై త్రిష అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి నటుడితో తాను ఇంకేప్పటికి నటించనని ట్వీట్ చేసింది. మరోవైపు మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై కోలీవుడ్ స్టార్స్ మండిపడుతున్నారు. ఇప్పటికే సింగర్ చిన్మయి శ్రీపాద, హీరోయిన్ మాళవిక మోహనన్ స్పందిస్తూ.. మహిళల గురించి ఇలా మాట్లాడడం చాలా అసహ్యంగా అనిపిస్తోందని.. మహిళల గురించి ఇలా మాట్లాడడం సిగ్గుచేటు.. ఇలా మాట్లాడేందుకు అతడికి ధైర్యం ఎలా వచ్చింది. ఇలాంటి సాహసం ఎలా చేయగలిగాడు.. తర్వాత జరిగే పరిణామాల గురించి ఆలోచించలేదా ?.. అతడిని చూస్తే సిగ్గేస్తోంది అంటూ ట్వీట్ చేసింది హీరోయిన్ మాళవిక.

ఇక మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలపై లియో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్పందించాడు. “మన్సూర్ అలీఖాన్ చేసిన స్త్రీదేషపూరిత వ్యాఖ్యలు విని ఆగ్రహానికి గురయ్యాము. మేమంతా కలిసి లియో సినిమా కోసం ఒకే జట్టుగా పనిచేశాము. మహిళలు, తోటి కళాకారులు, నిపుణుల పట్ల గౌరవం అనేది ఏ పరిశ్రమలోనైనా ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలి. అతడి మాటలను పూర్తిగా ఖండిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశాడు లోకేష్. ఇక అంతకు ముందు మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలపై త్రిష స్పందిస్తూ.. లైంగికంగా, అగౌరవంగా, స్త్రీ ద్వేషపూరితంగా అనిపిస్తుంది. చాలా అసహ్యకరమైనది. అలాంటి వ్యక్తితో నా సినిమా కెరీర్ లో ఎప్పటికీ నటించను అంటూ సీరియస్ అయ్యింది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో చిత్రంలో విజయ్ దళపతి, త్రిష జంటగా నటించారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించగా.. మన్సూర్ అలీఖాన్ కీలకపాత్రలో కనిపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.