AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allu Arjun: బన్నీతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న బడా నిర్మాణ సంస్థ.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో చేరిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప విడుదలైన అన్నీ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది

Allu Arjun: బన్నీతో భారీ సినిమా ప్లాన్ చేస్తున్న బడా నిర్మాణ సంస్థ.. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Rajeev Rayala
|

Updated on: Jan 25, 2022 | 7:24 AM

Share

Allu Arjun: పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో చేరిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప విడుదలైన అన్నీ భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు ఈ సినిమాను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇక రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప సినిమా డైలాగులే.. ఎక్కడ విన్నా పుష్ప మూవీ పాటలే. అంతలా ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమా. దేశ వ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని మ‌రోసారి పెంచేసిందీ చిత్రం. అల్లు అర్జున్ అద్ధుమైన న‌ట‌న‌, సుకుమార్ సూర్ డైరెక్ష‌న్‌, దేవీ శ్రీ మెస్మ‌రైజ్ మ్యూజిక్‌.. వెర‌సి ఈ సినిమాను విజ‌య తీరాల‌కు చేర్చింది. విడుద‌లైన అన్ని భాష‌ల్లో అద్భుత టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాపై ప్ర‌ముఖులు సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఇప్పుడు పార్ట్ 2 పైన దృష్టి పెట్టారు అల్లు అర్జున్ సుకుమార్. ఇదిలా ఉంటే ఇప్పుడు బన్నీ తో సినిమా చేయడానికి బడా నిర్మాణ సంస్థలన్నీ క్యూ కడుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ తో ఒక భారీ సినిమాను నిర్మించేందుకు గాను లైకా ప్రొడక్షన్స్ వారు ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమాకు గాను ఏకంగా బన్నీకి వంద కోట్ల పారితోషికంను ఆఫర్ చేసినట్లుగా ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బహుబాలి, సాహో సినిమాలతో వందకోట్ల రెమ్యునరేషన్ అందుకునే హీరోగా మారిపోయాడు. ఇప్పుడు బన్నీ కూడా ఆ స్థాయి పారితోషికంను లైకా వారి ద్వారా అందుకుంటున్నట్లుగా టాక్ నడుస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Kangana Ranaut: మన హీరోలను ఆకాశానికెత్తేసిన బాలీవుడ్ బ్యూటీ.. కానీ హిందీ హీరోలను మాత్రం..

Pragya Jaiswal: సల్మాన్ తో రొమాంటిక్ సాంగ్ చేశా.. ఆయన్ని మొదట ఏం అడిగానంటే.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రగ్య

Ram Gopal Varma: అసాధారణ శక్తికి ఆదిపరాశక్తి తోడైతే.. వాయిస్ ఓవర్ తో అదరగొట్టిన ఆర్జీవీ.. కొండా మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్..

Follow Us
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?