
అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది అందాల భామ లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో క్యూట్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆతర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా లావణ్యకు చెప్పుకోదగ్గ హిట్ మాత్రం పడలేదు. కానీ టాలీవుడ్ లో యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు మెగా హీరోవరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ ఇద్దరూ కలిసి రెండు సినిమాల్లో నటించారు. అదే సమయంలో ప్రేమలో పడటంతో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు లావణ్య, వరుణ్.
ఈ జంటకు ఓ కొడుకుకూడా ఉన్నాడు. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలు కంటిన్యూ చేస్తుంది. అయితే ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఇటీవలే ఓటీటీ కోసం ఓ సినిమా చేసింది లావణ్య. ఇదిలా ఉంటే లావణ్య ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుందట. ఇటీవల లావణ్య త్రిపాఠి వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది. అలాగే ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కెరీర్ లో మిస్ చేసుకున్న బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా ఏదైనా ఉందా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది.
ఓ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు కథ వినకుండానే నో చెప్పా.. అయితే ఆతర్వాత కథ తెలిసినప్పుడు సినిమా చేయాలని ఆశపడ్డా.. కానీ అప్పటికే అవకాశం చేజారిపోయిందని తెలిపింది. ఆతర్వాత ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని తెలిపింది లావణ్య. ఆ సినిమా ఎదో కాదు. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన గీత గోవిందం. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ పాత్ర కోసం లావణ్యను సంప్రదించారట.. కొన్ని కారణాల వల్ల ఆమె నో చెప్పడంతో రష్మిక మందన్న ఆ ఛాన్స్ అందుకుందట. ఇక గీత గోవిందం సినిమాతో ఫ్రెండ్స్ గా మారిన విజయ్, రష్మిక ప్రేమలో పడి ఇటీవలే పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.