Atharva OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘అథర్వ’.. మరో రెండు రోజుల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

|

Jan 16, 2024 | 11:09 AM

తాజాగా మరో సినిమా డిజిటల్ ప్లాట్ ఫాంపైకి రాబోతుంది. గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలై పర్వాలేదనిపించుకున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహించారు. శుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈసినిమాలో కొన్ని ట్విస్టులు బాగానే ఉన్నా.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

Atharva OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ అథర్వ.. మరో రెండు రోజుల్లో స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..
Atharva ott
Follow us on

పస్తుతం ఓటీటీల్లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రాంతీయ సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు డిజిటల్ ప్లాట్ ఫాం పై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. చిన్న సినిమాల నుంచి పెద్ద చిత్రాల వరకు ఈ ఏడాదిలో అడియన్స్ ముందుకు మరోసారి వచ్చేందుకు రెడీ అయ్యాయి. ఓవైపు థియేటర్లలో సంక్రాంతి చిత్రాలు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఓటీటీలో పలు సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో సినిమా డిజిటల్ ప్లాట్ ఫాంపైకి రాబోతుంది. గతేడాది డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలై పర్వాలేదనిపించుకున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ సినిమాకు మహేష్ రెడ్డి దర్శకత్వం వహించారు. శుభాష్ నూతలపాటి నిర్మించిన ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు. ఈసినిమాలో కొన్ని ట్విస్టులు బాగానే ఉన్నా.. ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.

థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. లేటేస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఈటీవీ విన్ లో జనవరి 18 నుంచి స్ట్రీమింగ్ రానుంది. ఈ విషయాన్ని సంక్రాంతి సందర్భంగా నిన్న (జనవరి 15న) అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మర్డర్ మిస్టరీని ఛేదించేందుకు క్లూస్ టీంలోని బయోమెట్రిక్ అనలిస్ట్ ప్రయత్నిస్తారు. ఇన్వెస్టిగేషన్ సంక్లిష్టంగా మారుతుంది. మరీ మిస్టరీని అతడు ఛేదించగలిగాడా ?.. అంటూ ఈటీవీ విన్ ట్వీట్ చేసింది.

కథ విషయానికి వస్తే.. దేవ అథర్వ కర్ణ (కార్తిక్ రాజు) పోలీస్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. అయితే అతడికి ఆస్థమా ఉండడంతో అది సాధ్యం కాదు. దీంతో పోలీస్ శాఖలోనే క్లూస్ టీంలో జాయిన్ కావొచ్చని ఓ వ్యక్తి సలహా ఇవ్వడంతో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు. చివరకు అదే టీంలో ఉద్యోగం సాధిస్తాడు. తన తెలివితో చాలా కేసులను పరిష్కరిస్తాడు. అథర్వ ఓ మర్డర్ కేసును దర్యాప్తు చేస్తాడు. ఈ క్రమంలోనే అతడికి ఎదురైన చిక్కులు, సవాళ్లు ఏంటీ అనేది ఈ సినిమా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.