NBK 107 Movie : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరిదశకు వచ్చేసింది. ఇప్పటికే బాలయ్యను సింహగా, లెజెండ్‌గా చూపించిన బోయపాటి ఇప్పుడు అఖండగా మన ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్లు అభిమానుల్లో అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఇక బోయపాటి సినిమాలో యాక్షన్ సన్నివేశాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కూడా రోమాలు నిక్కపొడుచుకునే ఫైట్స్ ఉండనున్నాయని టీజర్స్‌తోనే చెప్పేశారు బోయపాటి. అఖండ సినిమాను సంక్రాంతి బరిలో దించేలా సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా తర్వాత మరో మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలయ్య. ఇప్పటికే ఈ సినిమా కథను బాలకృష్ణ వినిపించడం.. ఆయన ఓకే చేయడం అంతా అయిపోయాయి.
ఇక గోపీచంద్ – బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా అనగానే అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. ఇటీవలే క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న గోపిచంద్.. ఇప్పుడు బాలయ్య కోసం ఎలాంటి కథను ఎంచుకున్నాడు..? ఆయన ఎలా కనిపించబోతున్నాడు..? అంటూ ఆరా తీస్తున్నారు అభిమానులు. అయితే బాలయ్యను పోలీస్‌గా చూపించబోతున్నాడని కొందరు.. లేదు ఫ్యాక్షనిస్ట్‌గా చూపిస్తాడని మరి కొందరు గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఎక్కువశాతం బాలయ్యలోని రౌడీయిజాన్ని బయటకు తీసుకురావడానికి గోపీచంద్ ట్రై చేస్తున్నారట. టైటిల్ కూడా `రౌడీయిజం`అని అనుకుంటున్నారట. ఈ సినిమాలో మాస్ అభిమానులకు కావాల్సినంత మాస్ ఎలిమెంట్స్.. హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ఉండనున్నాయని తెలుస్తుంది. అదేవిధంగా ఈ సినిమాలో బాలయ్య మూడు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
మరిన్ని ఇక్కడ చదవండి :
లక్కీ ఛాన్స్ అందుకున్న యంగ్ హీరోయిన్.. పుష్ప మూవీలో వర్ష బొల్లమ్మ.. ఏ రోల్ అంటే..
Love Story : మనసును తాకే అందమైన ప్రేమ కథ .. ఆకట్టుకుంటున్నశేఖర్ కమ్ముల’లవ్ స్టోరీ’ ట్రైలర్..