K.Viswanath Wife Jayalakshmi: కళాతపస్వి విశ్వనాథ్ సతీమణి కన్నుమూత.. నేడు అంత్యక్రియలు..

ఆయన మరణం తర్వాత 24 రోజులకే జయలక్ష్మి కూడా మృతి చెందడంతో ఆమె కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈరోజు పంజాగుట్ట శ్మశాన వాటికలో జయలక్ష్మి అంత్యక్రియలు జరగనున్నాయి.

K.Viswanath Wife Jayalakshmi: కళాతపస్వి విశ్వనాథ్ సతీమణి కన్నుమూత.. నేడు అంత్యక్రియలు..
Viswanath Wife Jayalakshmi

Updated on: Feb 27, 2023 | 7:57 AM

దివంగత దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య జయలక్ష్మి హైదరాబాద్ లోని స్వగృహంలో ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. ఆదివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈనెల 2న విశ్వనాథ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం తర్వాత 24 రోజులకే జయలక్ష్మి కూడా మృతి చెందడంతో ఆమె కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈరోజు పంజాగుట్ట శ్మశాన వాటికలో జయలక్ష్మి అంత్యక్రియలు జరగనున్నాయి.

విశ్వనాథ్‌-జయలక్ష్మిలకు పద్మావతి దేవి, కాశీనాథుని నాగేంద్రనాథ్‌, కాశీనాథుని రవీంద్రనాథ్‌ ముగ్గురు సంతానం. కాగా ప్రస్తుతం అమెరికాలో ఉన్న వీరి పెద్ద కుమారుడికి కబురు అందించారు కుటుంబ సభ్యులు. ఆయన వచ్చిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు విశ్వనాథ్‌ సతీమణి మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

‘నా భార్య నా సినిమాల్ని చూసి అలా ఉన్నాయి.. ఇలా ఉన్నాయని విశ్లేషించదు. బాగుంది అని మాత్రమే చెబుతుంది’ అంటూ ఓ సందర్భంలో కళాతపస్వి తన సతీమణి గురించి చెప్పారు.