తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు సిల్క్ స్మిత. ఒకప్పుడు సినీపరిశ్రమలో స్పెషల్ సాంగ్స్‌కు పెట్టింది పేరు. నిషా కళ్లతో.. తన అందచందాలతో చిత్రపరిశ్రమను ఓ ఊపు ఉపేసింది. ఇప్పటికీ ఆమె చేసిన సాంగ్స్ ఎక్కడో ఒక చోట వింటుంటాం. నటనపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది. కేవలం స్పెషల్ సాంగ్స్ మాత్రమే కాదు.. పలు సినిమాల్లో కీలకపాత్రలలో నటించి ప్రశంసలు అందుకుంది. అందం.. డాన్స్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని.. వెండితెరపై అందాల తారగా ఓ వెలుగు వెలిగిన ఆమె.. జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. అడుగడుగునా అనేక అవమానాలు ఎదుర్కొని స్టార్ డమ్ సంపాదించుకుంది.. కానీ చివరకు అదే స్టార్ డమ్ వల్ల చనిపోయింది. సిల్వర్ స్క్రీన్ తనను ఆరాధించిన అభిమానులే.. నిజ జీవితంలో ఎంతో చులకనగా చూసేవారట. కుటుంబసభ్యులు.. అభిమానులు అవమానించిన అంతగా పట్టించుకోని ఆమె.. నమ్మిన వ్యక్తి మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. జీవితంలో అనేక కష్టాలతో విసిగి వేసారిన సిల్క్ నమ్మినవ్యక్తి మోసం చేయడంతో మానసికంగా ఎంతో వేదన అనుభవించి 1996లో సూసైడ్ చేసుకుని తనువు చాలించింది.
అయితే చనిపోయేముందు సిల్క్ స్మిత సూసైడ్ నోట్ రాసుకుంది. అందులో తాను పడిన కష్టాలు.. మానసిక సంఘర్షణను బయటపెట్టింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు సిల్క్ స్మిత చివరి ఉత్తరం నెట్టింట వైరలవుతుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె రాసిన ఈ లేఖ ఎంతో మందిని కంటతడి పెట్టిస్తోంది.
“దేవుడా.. నా 7వ సంవత్సరం నుంచే పొట్టి కూటి కోసం కష్టపడ్డాను. నాకు నావారు అంటూ ఎవరు లేరు. నేను నమ్మినవారు నన్ను మోసం చేశారు. బాబు తప్ప నా మీద ఎవరికీ ప్రేమ లేదు. కేవలం బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే. నా సొమ్ము తిన్నవారే నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. అందరికీ మంచే చేశాను. కానీ నాకు చెడు జరిగింది. నా ఆస్తిలో ఉన్నదంతా బాబు కుటుంబానికి నా కుటుంబానికి పంచాలి. నా ఆశలన్నీ ఒకరిమీదే పెట్టుకున్నాను. అతను నన్ను మోసం చేసాడు. రాము.. రాధకృష్ణన్ నన్ను చాలా రెచ్చగొట్టారు. వారికి ఎంతో మేలు చేశాను. కానీ వారు నాకు దారుణం చేశారు. 5 సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి నాకు జీవితం ఇస్తానన్నాడు.
కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. నా రెక్కల కష్టం తినని వాడు లేడు బాబు తప్ప. ఇది రాయడానికి నేను ఎంత నరకం అనుభవించానో మాటల్లో చెప్పలేను. జీవితంలో ఎన్నో వేధింపులకు మరణమే శాశ్వతం అనిపిస్తుంది. ” అంటూ రాసుకొచ్చింది. అయితే ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకున్న సిల్క్ స్మిత చనిపోయినప్పుడు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరు వెళ్లలేదు. కేవలం హీరో అర్జున్ మాత్రమే వెళ్లారట. ఒక అనాథ శవంలా ఆమె అంత్యక్రియలు జరిపించారు.