
రత్తాలు రత్తాలు అంటూ మాస్ డ్యాన్స్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఊపేసిన రాయ్ లక్ష్మీ… ఇప్పుడు న్యూ గెటప్‌లోకి మారిపోయారు. నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో హల్ చల్ చేసే ఈ బ్యూటీ తాజాగా అల్ట్రా మోడ్రన్ లుక్‌లో రేసింగ్ బైక్ మీద.. ధూమ్ మచాలే అంటూ షికార్లు చేస్తున్నారు. ఏదైన సినిమా కోసం ఇలాంటి గెటప్ వేశారో.. లేకపోతే సరదాగా డిఫరెంట్ లుక్ ట్రై చేశారోగానీ.. ఈ నయా గెటప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది మాత్రమే కాదు ఐయామ్ గ్యాంగ్ స్టర్ బేబీ అంటూ యాక్షన్ కూడా మొదలు పెట్టారు రాయ్ లక్ష్మీ. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్ చల్ చేస్తున్నారు ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు వెకేషన్ ఫోటోస్‌తో పాటు గ్లామరస్ ఫోటో షూట్ పిక్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది కానీ .. ఆ మధ్య అభిమానుల హార్ట్ బ్రేక్ చేసే న్యూస్ కూడా ఎనౌన్స్ చేశారు.
ఓ ఇంటర్వ్యూల మాట్లాడుతూ.. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నా అంటూ సడన్ షాక్ ఇచ్చారు రాయ్ లక్ష్మీ. ప్రజెంట్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తుంది రాయ్ లక్ష్మీ. మరో వైపు ఐటమ్ సాంగ్స్ ఆకట్టుకుంటుంది. మరి ఈ ముద్దుగుమ్మ పెళ్లి తరువాత యాక్టింగ్ కంటిన్యూ చేస్తారా.. లేదా అన్న సస్పెన్స్‌కు మాత్రం ఇంకా తెరపడలేదు.
మరిన్ని ఇక్కడ చదవండి :