Sai Pallavi: అందరి ముందే సాయి పల్లవికి ముద్దు పెట్టిన అభిమాని.. లేడీ పవర్ స్టార్ రియాక్షన్ ఏంటంటే? వీడియో

న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా తండేల్ సినిమాతో మరో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే ఈ మూవీ వంద కోట్ల క్లబ్‌లో చేరింది.

Sai Pallavi: అందరి ముందే సాయి పల్లవికి ముద్దు పెట్టిన అభిమాని.. లేడీ పవర్ స్టార్ రియాక్షన్ ఏంటంటే? వీడియో
Sai Pallavi

Updated on: Feb 16, 2025 | 10:22 PM

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం తండేల్. చందూ మొండేటి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ఫిబ్రవరి 07న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిది. కేవలం 10 రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా తండేల్ ప్రమోషన్లలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. విడుదలకు ముందు జరిగిన తండేల్‌ జాతర ఈవెంట్‌లో ఓ మహిళా అభిమాని ఎలాగోలా సాయిపల్లవి దగ్గరకు వచ్చేసింది. హీరోయిన్ తో సెల్ఫీలు, ఫొటోలు దిగింది. ఆ తర్వాత హీరోయిన్ కు‌ షేక్‌హ్యాండ్‌ కూడా ఇచ్చింది. దీంతో తెగ సంతోషపడిపోయిన ఆమె సాయిపల్లవి చేతికి ముద్దు పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి రాగా ఇప్పుడు సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది.

కాగా బాషా సినిమాలో రజనీకాంత్‌ మాణిక్‌ బాషాగా మారిన సమయంలో తన అనుచరులంతా కూడా ఆయన చేతిని ముద్దాడుతుంటారు. ఇప్పుడు సాయి పల్లవి క్లిప్‌ ను కూడా రజనీకాంత్ తో పోలుస్తున్నారు నెటిజన్లు. భాషా రేంజ్ ఎలివేషన్స ఇచ్చి వీడియోను వైరల్ చేస్తున్నారు. మొత్తానికి లేడీ పవర్ స్టార్ క్రేజ్ మామలుగా ఉండడం లేదంటున్నారు ఆమె అభిమానులు ఇక సాయిపల్లవి ప్రస్తుతం రామాయణ సినిమాలో నటిస్తోంది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్నాడు

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

శ్రీకాకుళం జిల్లా కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన 22 మంది మత్స్యకారుల జీవితాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ తండేల్ సినిమాను తెరకెక్కించారు. అల్లు అరవింద్ సమర్పణలో నిర్మాత బన్నీ వాస్ నిర్మించారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. సినిమా విజయంలో పాటలు కూడా కీలక పాత్ర పోషించాయి.

10 రోజుల్లోనే 100 కోట్లు దాటేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.