Prithviraj Sukumaran: హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‏కు షాక్.. నోటీసులు జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ..

మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంగతి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు. కానీ అంతకు ముందే మలయాళంలో అతడు నటించిన సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇటీవలే ఎల్ 2 ఎంపురాన్ సినిమాతో మరో హిట్ అందుకున్నారు.

Prithviraj Sukumaran: హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‏కు షాక్.. నోటీసులు జారీ చేసిన ఆదాయపు పన్ను శాఖ..
Prithviraj Sukumaran

Updated on: Apr 05, 2025 | 2:08 PM

ఎల్ 2 ఎంపురాన్ సినిమా పై వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీనియర్ హీరో మోహన్ లాల్ ఈ కాంట్రావర్సీపై క్షమాపణలు చెప్పారు. అలాగే నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ తల్లి మల్లికా సుకుమారన్ సైతం ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు. తాజాగా పృథ్వీరాజ్ కు ఆదాయపు పన్ను శాఖ నోటీసు జారీ చేసింది. మూడు చిత్రాలలో నటుడి పారితోషికం గురించి సమాచారం కోరుతూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. కడువ, జనగణమన, గోల్డ్ చిత్రాల పారితోషికానికి సంబంధించిన సమాచారం అందించాలని ఆ నోటీసులు పేర్కొంది. ఈ చిత్రాలకు నటుడు ఎటువంటి పారితోషికం తీసుకోలేదు. అయితే సహ నిర్మాతగా దాదాపు 40 కోట్లు సంపాదించాడని సమాచారం.

ఈ పేరుతో వచ్చిన డబ్బుపై ఆదాయపు పన్ను శాఖ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇది సహజమైన ప్రక్రియ అని ఆదాయపు పన్ను శాఖ వివరించింది. గత నెల 29న పృథ్వీరాజ్ కు ఇమెయిల్ ద్వారా నోటీసు అందింది. ఈ నెల 29వ తేదీలోపు నోటీసుకు వివరణ ఇవ్వాలని వారికి తెలిపింది. ఇదిలా ఉండగా, ప్రముఖ పారిశ్రామికవేత్త గోకులం గోపాలన్ చెన్నై కార్యాలయం, నీలంకర నివాసంపై ఈడీ నిన్న దాడులు నిర్వహించింది.

అలాగే కేరళ, తమిళనాడులోని ఐదు ప్రదేశాలలో ఈ తనిఖీలు జరిగాయి. 14 గంటలపాటు ఈ తనిఖీలు జరిగాయని.. అర్ధరాత్రి పూర్తైనట్లు తెలుస్తోంది. నిన్న కోజికోడ్‌లో ఉన్న గోపాలన్‌ను సాయంత్రం చెన్నైకి పిలిపించి, అర్థరాత్రి వరకు ప్రశ్నించారు. విచారణ అనంతరం పత్రాలు, రూ.1.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను వివరంగా పరిశీలించి, మళ్ళీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..