Kumari Aunty: మూవీ లవర్స్‌కు కుమారీ ఆంటీ బంపరాఫర్.. ఆ సినిమా టికెట్ చూపిస్తే ఫుడ్ బిల్లుపై డిస్కౌంట్

హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు కుమారీ ఆంటీ. ఆ మధ్యన టీవీ షోస్ లోనూ సందడి చేసిన ఆమె ఇప్పుడు వెండితెరపై కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే తాజాగా మూవీ లవర్స్ కు ఒక బంపరాఫర్ ప్రకటించారీ సోషల్ మీడియా సెన్సేషన్

Kumari Aunty: మూవీ లవర్స్‌కు కుమారీ ఆంటీ బంపరాఫర్.. ఆ సినిమా టికెట్ చూపిస్తే ఫుడ్ బిల్లుపై డిస్కౌంట్
Kumari Aunty

Updated on: Aug 14, 2026 | 6:21 AM

హైదరాబాద్‌లో స్ట్రీట్‌ ఫుడ్‌ అమ్ముతూ సోషల్‌ మీడియాలో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యారు కుమారి ఆంటీ. ఆ మధ్యన కొన్ని టీవీ షోస్, సినిమా ప్రమోషన్లలో కనిపించిన ఆమె ఇప్పుడు ఏకంగా వెండితెరపై అరంగేట్రం చేస్తున్నారు. ‘పాంచాలి పంచభర్తృక’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. గంగ సప్తశిఖర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే సరీ ఫర్‌, రోల్‌ రైడా, రాజ్‌ పవన్‌, జెమినీ సురేష్‌, వెంకట్‌ దుగ్గిరెడ్డి వంటి వారు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. రాయల్‌ థ్రోన్‌ ప్రొడక్షన్స్‌, ఓం సాయిరాం ఆర్ట్స్‌ బ్యానర్లపై వెంకట్‌ దుగ్గిరెడ్డి, రాజ్‌ పవన్‌ శ్రీకాంత్‌ సెట్టివారి, సాయినాథ్‌ మణ్యం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇవాళ (ఆగస్టు 14) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ వేదికగా పాంచాలి పంచభర్తృక సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరిగింది. కుమారీ ఆంటీ కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా ఆడియెన్స్ కు ఒక బంపరాఫర్ ప్రకటించారామె. పాంచాలి పంచభర్తృక మూవీ చూసి థియేటర్‌ టికెట్‌ను తన వద్దకు తీసుకొచ్చిన వారికి ఫుడ్‌ బిల్లుపై రూ.100 డిస్కౌంట్‌ ఇస్తానని కుమారి ఆంటీ ప్రకటించారు.

 

ఇవి కూడా చదవండి

‘పాంచాలి పంచభర్తృక సినిమాను ప్రేక్షకులు థియేటర్లలో చూసి ఆదరించాలి. . సినిమా చూసిన ప్రేక్షకులు టికెట్‌ను చూపిస్తే నా ఫుడ్‌ సెంటర్‌లో బిల్లుపై రూ.100 తగ్గిస్తాను’ అని కుమారీ ఆంటీ చెప్పుకొచ్చారు. కుమారీ ఆంటీ చేసిన ఈ మూవీ టికెడ్ ఫుడ్ ఆఫర్ ప్రకటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే సందర్భంగా తన సినిమా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కుమారీ ఆంటీ. ‘యూట్యూబ్‌, ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్.. ఇలా సోషల్‌ మీడియా కారణంగానే నాకు ఇంతటి గుర్తింపు వచ్చింది. అయితే సినిమాల్లో నటిస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఈ చిత్రంలో నాకు అవకాశం కల్పించినందుకు దర్శకుడు, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా ద్వారా నేను ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాననే నమ్మకం ఉంది’ అని కుమారీ ఆంటీ పేర్కొన్నారు.

పాంచాలి పంచభర్తృక సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో కుమారీ ఆంటీ స్పీచ్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us