Hebah Patel: కుమారి 21ఎఫ్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది అందాల తార హెబ్బా పటేల్. ఈ సినిమాలో ఓవైపు గ్లామర్‌తో పాటు మరోవైపు తనదైన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకుందీ బ్యూటీ. నిజానికి ఈ సినిమా కంటే ముందే వచ్చిన ‘అలా ఎలా’ సినిమాతో తెలుగులో కనిపించినప్పటికీ ఈ సినిమా పెద్దగా హెబ్బాకు గుర్తింపు తీసుకురాలేదు. ఇక తర్వాత వచ్చిన 24 కిస్సెస్, ఒరేయ్ బుజ్జిగా సినిమాలతో ఆకట్టుకుందీ అందాల తార.
ఇదిలా ఉంటే సినిమాలతో బిజీగా ఉండే హెబ్బా.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, సినిమా విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అందాల తార ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. ఏదో సినిమా షూటింగ్ స్పాట్‌లో ఎర్ర రంగు చీర కట్టులో ఉన్న హెబ్బా.. చెట్టు ఎక్కి అక్కడ కాఫీ తాగుతోంది. ఇక ఈ ఫొటోను పోస్ట్ చేసిన హెబ్బా.. ‘ఎక్కడైనా.. ఎక్కడున్నా కాఫీ తాగితే.. ఈ ఐడియా చాలా బాగుంది’ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. ఈ పోస్ట్‌కు హెబ్బా అభిమానులు కామెంట్లు, లైక్‌ల వర్షం కురిపిస్తున్నారు. ఇక హెబ్బా పటేల్ కెరీర్ విషయానికొస్తే.. ‘ఓదెల రైల్వే స్టేషన్’, ‘తెలిసిన వాళ్లు’ అనే చిత్రాల్లో నటిస్తోంది. ఈ రెండు చిత్రాలు నటనకు ప్రాధాన్యత ఉండేవే కావడం విశేషం. ఇక ఇటీవల ‘తెలిసిన వాళ్లు’ చిత్ర యూనిట్ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమా పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. విప్లవ్ కోనేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లేడీ ఓరియెంటెండ్‌గా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ రెండు చిత్రాలతో హెబ్బా ఎలాంటి విజయాన్ని సింతం చేసుకుంటుందో చూడాలి.
Also Read: Vijay Devarakonda: మరో వ్యాపార రంగంలోకి అడుగు పెడుతోన్న ‘రౌడీ హీరో’… ఏషియన్ సినిమాస్‌తో కలిసి…