
టాలీవుడ్‌లో క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు కృష్ణ వంశీ. ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. సిందూరం, మురారి, ఖడ్గం ఇలా చెప్పుకుంటూ పొతే చాలా సినిమాలు ఉన్నాయి. కృష్ణవంశీ ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించారు. గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత కృష్ణ వంశీ కొంచం గ్యాప్ తీసుకున్నారు. ఇక ఇప్పుడు రంగమార్తాండ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు కృష్ణ వంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
చిరంజీవిని అన్నయ్య అని ఆప్యాయంగా పిలుస్తుంటారు కృష్ణవంశీ..” చిరంజీవి గారితో నాకు మంచి అనుబంధం, చనువు వుంది. అయినా ‘రంగమార్తాండ’ సినిమాకి వాయిర్ ఓవర్ చెబుతారా.?’ అని అడగడానికి ముందు భయపడ్డాను. ‘ఎందుకయ్యా భయం’ అని ఆయన అనేసరికి షాక్ అయ్యాను. కానీ అంత ఇమేజ్, రేంజ్ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి వెంటనే అడగలేం కద. చిరంజీవి గారు ఒక శిఖరం .. ఆయన ముందు డాన్సులు చేయకూడదు. మన లిమిట్స్ లో మనం ఉండాలి అని అన్నారు కృష్ణ వంశీ.
చిరంజీవి గారితో అప్పట్లో ఒక సినిమా చేయాలనీ చూశాను.ఆయన కూడా చేయడానికి రెడీ అయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. చిరంజీవిగారితో సినిమా అంటే ఆషామాషీ కాదు. అన్ని కుదరాలి. ఆ సినిమా ఆయన తప్ప మరెవ్వరూ చేయలేరు అనేలా ఉండాలి. అలాంటి కథ దొరికినప్పుడు తప్పకుండా చేస్తా అన్నారు కృష్ణవంశీ.