కృష్ణంరాజు(Krishnam Raju)మరణంతో టాలీవుడ్ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణం రాజు చికిత్స పొందుతూ కన్నుమూశారు. 83 ఏళ్ల కృష్ణంరాజు మరణవార్త విని టాలీవుడ్ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు రెబల్ స్టార్. నటనతో, డైలాగ్ డెలివరీతో కృష్ణం రాజు ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. మొదట్లో నెగిటివ్ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైన కృష్ణంరాజు ఆ తరువాత ‘కృష్ణవేణి’ ‘భక్త కన్నప్ప’ ‘త్రిశూలం’ ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ‘పల్నాటి పౌరుషం’ వంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ నేడు( ఆదివారం) తెల్లవారుజామున కన్నుమూశారు. కృష్ణం రాజు మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అభిమానులంతా కృష్ణం రాజు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయాయిరు.
కృష్ణం రాజు మృతి పై ఏఐజీ ఆసుపత్రి స్పందించింది. డయాబెటిస్, కరోనరీ హార్ట్ డీసీజ్ తో కృష్ణం రాజు ఇబ్బందిపడిట్టు తెలిపారు వైద్యులు. అలాగే కృష్ణం రాజు గుండె కొట్టుకునే వేగంతో చాలా కాలంగా ఇబ్బందిపడుతున్నారని, రక్త ప్రసరణలో సమస్యతో గతేడాది కాలుకి శాస్త్ర చికిత్స చేయించుకున్నారని తెలిపారు. ఇక దీర్ఘ కాలిక కిడ్నీ , ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న కృష్ణం రాజు..పోస్ట్ కోవిడ్ సమస్యతో గత నెల 5 వ తేదీన ఆసుపత్రిలో చేరారు. మల్టి డ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర నెన్యూమోనియా ఉన్నట్టు గుర్తించారు వైద్యులు. ఇక కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు అయితే ఉదయం గుండెపోటు రావడంతో కృష్ణం రాజు మృతి చెందినట్టు వెల్లడించారు ఏఐజీ ఆస్పత్రి వైద్యులు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.