G. V. Prakash Kumar: ఎంతకు తెగించార్రా.. ‘అమ్మ’ పేరుతో మోసం మంచి మనిషిని మోసం చేశారు కదరా!

తాము కష్టాల్లో ఉన్నామని, సాయం చేయాలని సెలబ్రిటీల సాయం కోరుతుంటారు చాలా మంది. దీంతో వెనకా ముందు ఆలోచించకుండా హీరో, హీరోయిన్లు కష్టాల్లో ఉన్నవారికి ఆపన్న హస్తం అందిస్తుంటారు. అయితే దీనినే అవకాశంగా తీసుకుని ఒక వ్యక్తి హీరో జీవి ప్రకాశ్ కుమార్ ను మోసం చేశాడు.

G. V. Prakash Kumar: ఎంతకు తెగించార్రా.. అమ్మ పేరుతో మోసం మంచి మనిషిని మోసం చేశారు కదరా!
G V Prakash Kumar

Updated on: Dec 26, 2025 | 11:14 AM

హీరోగా, సంగీత దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు జీవీ ప్రకాశ్ కుమార్. తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నింటిలోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు జీవీ. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఈ హీరోకు సామాజిక స్పృహ ఎక్కువ. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే సాయమందిస్తాడు. అలా గతంలో చాలా మందికి ఆపన్న హస్తం అందించి రియల్ హీరో అనిపించుకున్నాడు జీవీ. అయితే దురదృష్టవశాత్తూ ఆయననే బురిడీ కొట్టించాడు ఒక వ్యక్తి. సాయం కావాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి జీవీ ప్రకాశ్ కుమార్ ను మోసం చేశాడు. వివరాల్లోకి వెళితే.. జీవీ ప్రకాష్ సోషల్‌మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. ఎవరైనా సాయం చేయాలని పోస్ట్ కనిపిస్తే వెంటనే స్పందించి తన వంతు సాయం చేస్తాడు కూడా. అలా ఒక ట్విట్టర్ (ఎక్స్‌)పేజీలో @prasannasathis అనే ప్రొఫైల్ పేరుతో ఒక గుర్తు తెలియని ఒక పోస్ట్ పెట్టాడు. చాలా కాలం క్రితం మరణించిన ఒక వృద్ధ మహిళ ఫొటోను పోస్ట్ చేసి, ఆమె తన తల్లి అని పేర్కొన్నాడు.

అంతేకాకుండా తన తండ్రి కూడా చాలా ఏళ్ల క్రితమే కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడని కట్టు కథ చెప్పుకొచ్చాడు. తల్లి మాత్రమే కుటుంబాన్ని చూసుకుంటుందని, ఇప్పుడు ఆమె కూడా మరణించారని ఒక సినిమా స్టోర అల్లాడు. ఆమె అంత్యక్రియలను పూర్తి చేయడానికి తన వద్ద ఒక్క రూపాయి కూడా లేదంటూ ఆర్థిక సహాయం చేయాలని జీవీ ప్రకాష్‌ను కోరాడు. ఆ వ్యక్తి చెప్పిన కట్టు కథకు కోలీవుడ్ హీరో చలించిపోయాడు. సదరు వ్యక్తికి వెంటనే రూ. 20 వేలు గూగుల్‌ పే చేశారు. అయితే కొందరు నెటిజన్లు ఆ ఫొటోను డీకోడ్‌ చేస్తే అసలు మోసం వెలుగులోకి వ చ్చింది. గూగుల్‌ ద్వారా సెర్చ్ చేస్తే ఆ ఫొటో చాలా ఏళ్ల క్రితం నాటిదన్న విషయం తెలిసింది. ఒక ఫేక్‌ స్టోరీ చెప్పి మోసం చేశాడని జీవీ ప్రకాష్‌కు మెసేజ్‌లు పంపారు.

ఇవి కూడా చదవండి

ఈ విషయం తెలుసుకున్న జీవీ ప్రకాశ్ అతని నెంబర్‌కు కాల్‌ చేశాడు. కానీ అతను రెస్పాండ్‌ కాలేదని ప్రకాష్‌ వాపోయాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. అమ్మ పేరు చెప్పుకుని ఇలా మోసం చేయడం ఏంటి అంటూ నెటిజన్లు చీటర్ పై భగ్గుమంటున్నారు. అదే సమయంలో అడిగిన వెంటనే సాయం చేసిన ప్రకాష్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి మోసాలు చేస్తే సాయం చేసే వారు మరోసారి ముందుకు రారని గుర్తుచేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి