తమిళ సూపర్ స్టార్ ధనుష్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా అతనికి అభిమానులున్నారు. అందుకే ‘రాన్‌జానా’, ‘అత్రంగి రే’ లాంటి హిందీ సినిమాలు చేశాడు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సూపర్ స్టార్‌కు బోలెడు క్రేజ్ ఉంది. అందుకే ధనుష్ నటించిన సినిమాలన్నీ క్రమం తప్పకుండా తెలుగులోనూ విడుదలవుతుంటాయి. అందులో చాలా హిట్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడీ కోలీవుడ్ స్టార్. తెలుగులోనే స్ట్రెయిట్‌గా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఈ ఏడాది జూన్‌లో ఫీల్ గుడ్ డైరెక్టర్ ‘శేఖర్ కమ్ముల’తో సినిమాను ప్రకటించిన ధనుష్ తాజాగా మరొక స్ట్రెయిట్ తెలుగు సినిమాను అనౌన్స్ చేశాడు. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ఞు’, ‘రంగ్‌దే’లాంటి విభిన్న ప్రేమకథ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో కొత్త సినిమాకు పచ్చజెండా ఊపాడు.
ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన తదుపరి ప్రాజెక్ట్ వివరాలను వెల్లడించాడు ధనుష్ ‘ తమిళంలో నా తదుపరి సినిమా, తెలుగులో నా తొలి సినిమా.. రేపు ఉదయం 9.36 గంటలకు సినిమా టైటిల్‌ను ప్రకటిస్తాం’ అంటూ రాసుకొచ్చాడు. కాగా ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నారాయణదాస్ నారంగ్, పుస్కూరు రామ్మోహన్ రావు నిర్మించనున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.
My next Tamil film and my first direct telugu film .. title announcement tom ?? Om Namashivaaya pic.twitter.com/cnaeMXO2h0
— Dhanush (@dhanushkraja) December 22, 2021
Viral Video: తెగిన పారాచూట్ తాడు.. సముద్రంలో పడిపోయిన మహిళలు.. తర్వాత ఏం జరిగిందంటే..