Suriya: సూర్య మంచి మనసు.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అభిమాని కుటుంబానికి భరోసా..

ష్టాల్లో ఉన్న ఫ్యాన్స్‏కు చేయూతనందిస్తుంటారు. ఇక తాజాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన అభిమాని కుటుంబాన్ని పరామర్శించాడు హీరో సూర్య. అతడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఎన్నూరుకు చెందిన అరవింద్ సూర్య వీరాభిమాని. కొన్నేళ్లుగా అరవింద్ సూర్య ఫ్యాన్ క్లబ్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అరవింద్ చనిపోయారు.

Suriya: సూర్య మంచి మనసు.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అభిమాని కుటుంబానికి భరోసా..
Suriya

Updated on: Sep 28, 2023 | 3:35 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మంచి మనసు గురించి తెలిసిందే. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.. తన అభిమానులతో ఇంట్రాక్ట్ అవుతుంటారు. కష్టాల్లో ఉన్న ఫ్యాన్స్‏కు చేయూతనందిస్తుంటారు. ఇక తాజాగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తన అభిమాని కుటుంబాన్ని పరామర్శించాడు హీరో సూర్య. అతడి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఎన్నూరుకు చెందిన అరవింద్ సూర్య వీరాభిమాని. కొన్నేళ్లుగా అరవింద్ సూర్య ఫ్యాన్ క్లబ్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అరవింద్ చనిపోయారు.

ఈ విషయం తెలుసుకున్న సూర్య.. వెంటనే అతని ఇంటికి వెళ్లారు. అక్కడే ఉన్న అరవింద్ చిత్రపటానికి నివాళులర్పించారు. అరవింద్ తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఓదార్చి.. వారిలో ధైర్యాన్ని నింపారు. గతంలో తన అభిమానులు చనిపోతే వాళ్ల కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చాడు.

సినిమాలతో బిజీగా ఉన్న సూర్య.. ఇటు సామాజిక ప్రగతికి సంబంధించిన పలు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారు. అలాగే అకారం ఫౌండేషన్‌ని స్థాపించి విద్యా సహాయం అందిస్తున్నారు సూర్య, జ్యోతిక. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సూర్య ‘కంగువా’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి డైరెక్టర్ శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్రీడీలో ఏకంగా పది భాషల్లో రూపొందిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది అడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.