Sivakarthikeyan: ఈ స్టార్ హీరోది ఎంత మంచి మనసో! ఏకంగా ఆ జంతువును దత్తత తీసుకున్న శివ కార్తికేయన్

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఇటీవలే పరాశక్తి సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే శివ కార్తికేయన్ నటన మాత్రం అద్దరిపోయిందన్న ప్రశంసలు వినిపించాయి.

Sivakarthikeyan: ఈ స్టార్ హీరోది ఎంత మంచి మనసో! ఏకంగా ఆ జంతువును దత్తత తీసుకున్న శివ కార్తికేయన్
Sivakarthikeyan

Updated on: Jan 20, 2026 | 10:00 PM

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ ఈ నటునికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అమరన్ సినిమా శివ కార్తికేయన్ కు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తీసుకొచ్చింది. గతేడాది మదరాసి సినిమాతో ఆకట్టుకున్న ఈ హీరో ఈ సంక్రాంతికి పరాశక్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. 1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం, తదితర సంఘటనల ఆధారంగా పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ పరాశక్తి సినిమాను తెరకెక్కించారు. అయితే ఎందుకోగానీ ఈ మూవీ పెద్దగా ఆడియెన్స్ కు ఎక్కలేదు. సినిమాల సంగతి పక్కన పెడితే.. హీరో శివ కార్తికేయన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వండలూర్‌ జూ పార్క్‌లోని ఏనుగును దత్తత తీసుకున్నారు. ఆరునెలల పాటు ఆ ఏనుగు సంరక్షణ బాధ్యతలను హీరోనే చూసుకోనున్నారు.

చెన్నై సమీపంలోనే వండలూర్‌ జూ (అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్) ఉంది. ఇక్కడ ఉండే ప్రకృతి అనే పేరు గల ఏనుగు సంరక్షణను ఇప్పుడు శివ కార్తికేయన్‌ పర్యవేక్షించనున్నారు. ఈ విషయాన్ని జూ పార్క్ అధికారులు అఫీషియల్‌గా ప్రకటించారు. ఇది చూసిన హీరో ఫ్యాన్స్.. అన్న గ్రేట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా శివ కార్తికేయన్ ఇలా జంతువులను దత్తత తీసుకోవడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలోనూ పలు సార్లు వివిధ జంతువులను దత్తత తీసుకుని వాటి బాగోగులు చూసుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఏనుగును దత్తత తీసుకుని మూగ జీవాలపై తన ప్రేమను చాటుకున్నాడీ ట్యాలెంటెడ్ హీరో.

ఇవి కూడా చదవండి

ఫ్యామిలీతో కలిసి సంక్రాంతి సంబరాల్లో శివ కార్తికేయన్..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..