Krishna: సొంత స్థలంలో కాకుండా మహా ప్రస్థానంలోనే కృష్ణ అంత్యక్రియలు ఎందుకు చేశారో తెలుసా ?..

కృష్ణ భౌతికకాయానికి కడసారి కుటుంబ సభ్యులు కన్నీటి నివాళి అర్పించారు. ఆయన చిన్న కుమారుడు మహేష్ కృష్ణకు తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అయితే సినీ దిగ్గజ నటుడికి సొంత స్థలంలో కాకుండా మహాప్రస్థానంలో

Krishna: సొంత స్థలంలో కాకుండా మహా ప్రస్థానంలోనే కృష్ణ అంత్యక్రియలు ఎందుకు చేశారో తెలుసా ?..
Krishna

Updated on: Nov 18, 2022 | 7:32 AM

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. వెండితెరపై దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించి తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్నారు. కృష్ణ మరణంతో సినీ పరిశ్రమలో ఓ మహా శకం ముగిసింది. సినీ దిగ్గజం, సూపర్​స్టార్​ కృష్ణ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. బుధవారం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు వందలమంది అభిమానులు, చలనచిత్ర, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. కృష్ణ భౌతికకాయానికి కడసారి కుటుంబ సభ్యులు కన్నీటి నివాళి అర్పించారు. ఆయన చిన్న కుమారుడు మహేష్ కృష్ణకు తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అయితే సినీ దిగ్గజ నటుడికి సొంత స్థలంలో కాకుండా మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.. అయితే అంతటి మహా నటుడికి ఇలా మహా ప్రస్థానంలో నిర్వహించడంపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాజాగా ఈ విషయంపై ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు స్పందించారు. కృష్ణ సతీమణి ఇందిరా దేవి అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు నిర్వహించామని.. కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అంత్యక్రియలు కూడా అక్కడే నిర్వహించినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. మరోవైపు దివికేగిన నటశేఖరుడు గుర్తులను పదిలంగా భద్రపరుచుకునేందుకు ఆయన కుటుంబం కీలకనిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

ఇందుకోసం భాగ్యనగరంలో కృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని మహేష్ కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. అలాగే ఆయనకు సంబంధించిన గుర్తులన్నింటినీ పొందుపరుస్తారట. హైదరాబాదులో పద్మాలయ స్టూడియో వద్ద ఈ మెమోరియల్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆయనకి సంబంధించిన 350 సినిమాలో పేర్లు, ఫోటోలు, అవార్డులను ఆయన కాంస్య విగ్రహంలో ఉంచుతారని సమాచారం.