Cinema : ఏం సిరీస్ భయ్యా.. సస్పెన్స్, ట్విస్టులతో పిచ్చెక్కిస్తోంది.. 5 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్లో టాప్.. ఇప్పటికీ క్రేజ్..
ప్రస్తుత రోజుల్లో యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాల నుంచి వెబ్ సిరీస్ వరకు.. ప్రతి మూవీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిరీస్ ప్రతి క్షణం జనాలను మెస్మరైజ్ చేస్తుంది. ఈ సిరీస్ దాదాపు 5 సంవత్సరాలుగా ఓటీటీలో దూసుకుపోతుంది. ఇప్పుడు ఈ సిరీస్ మరోసారి ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ సిరీస్ పేరెంటీ.. అసలు కథేంటీ తెలుసుకుందాం.

ప్రస్తుతం ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ విడుదలవుతున్నాయి. సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్, మిస్టరీ చిత్రాలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 2021లో విడుదలైన ఈ మూవీ పెద్దగా ఆర్బాటం లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ సిరీస్ పేరు మత్య్సకాండ్. ఇందులో రవి దూబే ప్రధాన పాత్ర పోషించారు. అలాగే నటి జోయ అఫ్రోజ్ కీలకపాత్ర పోషించింది. ఈ సిరీస్‌లో మధుర్ మిట్టల్, శ్రీకాంత్ వర్మ, పీయూష్ మిశ్రా, రాజేష్ శర్మ, నవేద్ అస్లాం వంటి తారలు ముఖ్య పాత్రలు పోషించారు. అజయ్ భుయాన్ దర్శకత్వం వహించిన ఈ 11-ఎపిసోడ్‌ల సిరీస్, మానసిక ఆటలు, ఉత్కంఠ, మారువేషం వేయడంలో ఉన్న ప్రత్యేకమైన కళపై ఆధారపడి ఉంది. ఆయుధాల కంటే తెలివితేటలే ముఖ్యమయ్యే ఒక ఉత్కంఠభరితమైన మానసిక ఆట గురించే ఈ సిరీస్ కథ. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ సిరీస్ కథేంటీ..? ఎందుకు జనాలు తెగ చూస్తున్నారు ? అనే విషయాలు తెలుసుకుందామా.
ఎక్కువ మంది చదివినవి : Athadu Movie : అతడు సినిమా హిట్ అవ్వడానికి కారణం ఆయనే.. నాజర్ కామెంట్స్..
కథ విషయానికి వస్తే.. ఈ వెబ్ సిరీస్ కథ మత్స్య థాడా (రవి దూబే) చుట్టూ తిరుగుతుంది. అతను తన తెలివితేటలతో దేశంలోనే అత్యంత జిత్తులమారి దొంగగా మారతాడు. తన కుటుంబానికి జరిగిన ఘోరమైన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనే బలమైన కోరికతో అతను ముందుకు సాగుతాడు. అతను జైలుకు వెళ్లినప్పుడు అతని జీవితం మలుపు తీసుకుంటుంది. అక్కడ అతను ఆనంద్ పండిట్ (పియూష్ మిశ్రా)ను కలుస్తాడు. ఆయనే అతనికి గురువు అవుతాడు. ఆయుధాలు చేపట్టకుండానే మహాభారతంలోని రాజకీయ సూత్రాలను అత్యంత శక్తివంతమైన ఆయుధంగా ఎలా ఉపయోగించాలో ఆనంద్ అతనికి బోధిస్తాడు. జైలు నుండి విడుదలైన తర్వాత, మత్స్య దేశంలోని ఉన్నత వర్గాలతో, అవినీతి వ్యవస్థతో ఆటలు ఆడటం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ఏసీపీ తేజ్‌రాజ్ సింగ్ (రవి కిషన్) కథలోకి ప్రవేశిస్తాడు. తేజ్‌రాజ్ ఒక సాధారణ పోలీస్ కాదు, నేరస్థుడిని పట్టుకోవడానికి తానే ఒక నేరస్థుడిలా ఆలోచించగల సామర్థ్యం అతనికి ఉంటుంది. దీని తర్వాత, మత్స్య మరియు తేజ్‌రాజ్‌ల మధ్య చాలా ఉత్కంఠభరితమైన , నాటకీయమైన ఆట మొదలవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?
మొత్తం 11 ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ ఇప్పుడు దూసుకుపోతుంది. అందుకే ఈ సిరీస్ లోని పదకొండు ఎపిసోడ్స్ అన్నింటికి మహాభారతంలోని పాత్రలు లేదా సంఘటనల పేర్లు పెట్టారు. ఉదాహరణకు.. అభిమన్యుడు, భస్మాసురుడు, మోహిని అవతారం మొదలైనవి. రవి దూబే ఈ ధారావాహికలో సుమారు 11 విభిన్న పాత్రలు పోషించారు. ‘మత్స్య కాండ్’ అనే వెబ్ సిరీస్‌ను జైపూర్, మీరట్ , ఢిల్లీలో చిత్రీకరించారు. ఈ సిరీస్‌కు IMDBలో పదికి 8.5 రేటింగ్ లభించింది. మీరు ఈ సిరీస్‌ను MX ప్లేయర్ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో చూడవచ్చు.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..
ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..
