Actress : సౌత్ ఇండస్ట్రీలో రిచెస్ట్ హీరోయిన్.. నయనతార, అనుష్క కంటే ఎక్కువ ఆస్తులు..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుని.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటున్నారు. కానీ దక్షిణాదిలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కానీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం దూసుకుపోతుంది.

Actress : సౌత్ ఇండస్ట్రీలో రిచెస్ట్ హీరోయిన్.. నయనతార, అనుష్క కంటే ఎక్కువ ఆస్తులు..
Jyotika

Updated on: Aug 12, 2025 | 4:42 PM

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లు నయనతార, రష్మిక మందన్నా, అనుష్క శెట్టి, సాయి పల్లవి, సమంత.. వీరంతా వరుసగా హిట్లతో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కానీ మీకు తెలుసా..? దక్షిణాదిలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో. తన నటనతో లక్షలాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. తెలుగు, తమిళం భాషలలో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె.. ఇప్పుడు హిందీలో ఎక్కువగా నటిస్తుంది. చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం దూసుకుపోతుంది. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ ఆస్తులు సంపాదించిన ఈ భామ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ జ్యోతిక.

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..

ఇవి కూడా చదవండి

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాలతో మెప్పించింది. 1998లో డాలీ సజాకే రఖ్నా సినిమాతో సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళం భాషలలో ఎక్కువగా అవకాశాలు అందుకుంది. ఒకప్పుడు అగ్ర కథానాయికగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జ్యోతిక.. కోలీవుడ్ హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న జ్యోతిక.. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఎక్కువగా హిందీలో సినిమాలు చేస్తుంది. ఇటీవలే షైతాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.

ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..

ఇదిలా ఉంటే.. నివేదికల ప్రకారం జ్యోతిక ఆస్తులు రూ.331 కోట్లు. ఆమె భర్త సూర్య ఆస్తులు రూ.206 కోట్లు. ఇద్దరి ఆస్తులు మొత్తం రూ.530 కోట్లు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జ్యోతిక ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు తీసుకుంటుంది. సినిమాలతోపాటు రియల్ ఎస్టేట్, వ్యాపారాల్లోనూ వీరు పెట్టుబడులు పెట్టారు. అలాగే జ్యోతిక పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నారు. ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీతో కలిసి ముంబైలోని రూ.70 కోట్ల విలువైన విలాసవంతమైన ఇంట్లో ఉంటుంది.

ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‏ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‏తో బ్యాచిలర్ పార్టీ..

ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..