Tollywood : 28 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. ఇప్పటికీ కుర్రాళ్లు పాడుకుంటున్న నాగార్జున హిట్ సాంగ్..

ప్రస్తుతం యూట్యూబ్‌లో తెలంగాణ ఫోక్ సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. కానీ మీకు తెలుసా.. ఒకే ఒక్క పాట మరోసారి సోషల్ మీడియాలో సత్తా చాటుతుంది. దాదాపు 28 సంవత్సరాలకుపైగా ఈ పాట క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు కొత్త సినిమాలు పాటలకు ధీటుగా ఈ సాంగ్ మిలియన్ వ్యూస్ అందుకుని దూసుకుపోతుంది.

Tollywood : 28 ఏళ్లుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. ఇప్పటికీ కుర్రాళ్లు పాడుకుంటున్న నాగార్జున హిట్ సాంగ్..
Soniya Soniya Song

Updated on: May 16, 2026 | 12:43 PM

సంగీత ప్రపంచంలో కొన్ని పాటలు కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. అలాంటి అద్భుతమైన క్లాసిక్ సాంగ్స్‌లో కింగ్ నాగార్జున, గ్లామర్ క్వీన్ సుస్మితా సేన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘సోనియా సోనియా’ పాట ఒకటి. 1997లో విడుదలైన ‘రక్షకుడు’ (తమిళంలో ‘రచ్చగన్’) సినిమాలోని ఈ పాట విడుదలై దాదాపు 28 ఏళ్లు కావస్తున్నా, ఇప్పటికీ యూట్యూబ్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో ఉంటూ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉంది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ కెరీర్ ఆరంభంలో అందించిన అల్టిమేట్ ఆల్బమ్స్‌లో ‘రక్షకుడు’ ఒకటి.

ఎక్కువ మంది చదివినవి : Ananya Nagalla : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అలాంటి భర్త రావాలి.. హీరోయిన్ అనన్య నాగళ్ల..

ఈ సినిమాలోని “సోనియా సోనియా” పాటకు ఆయన అందించిన వెస్ట్రన్, మోడ్రన్ బీట్స్ అప్పట్లో ఒక ఊపు ఊపాయి. గాయకులు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, ఉదిత్ నారాయణ్ (తమిళ, తెలుగు వెర్షన్స్) ఆలపించిన ఈ పాటలోని ఎనర్జీ అద్భుతం. రెహమాన్ ఉపయోగించిన వినూత్నమైన మ్యూజిక్ ప్యాటర్న్స్, క్యాచీ లిరిక్స్ ఈ పాటను అప్పట్లోనే కాకుండా నేటి తరం యువతకు సైతం ఫేవరెట్ ప్లేలిస్ట్‌గా మార్చేశాయి.

ఎక్కువ మంది చదివినవి :  Chiranjeevi- Rajinikanth: రజినీకాంత్ హీరో.. చిరంజీవి విలన్.. కట్ చేస్తే.. అక్కడ బ్లాక్ బస్టర్..

ఈ పాట ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కేవలం సంగీతం మాత్రమే కాదు, విజువల్స్ కూడా ముఖ్య కారణం. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తన స్టైలిష్ లుక్, అదిరిపోయే కాస్ట్యూమ్స్ , గ్రేస్‌ఫుల్ స్టెప్స్‌తో స్క్రీన్‌పై మ్యాజిక్ చేశారు. ఆయనకు తోడుగా మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ తన గ్లామర్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో స్టేజ్ మొత్తాన్ని షేక్ చేసింది. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ, అప్పట్లోనే గ్రాండ్‌గా డిజైన్ చేసిన భారీ సెట్స్ , రిచ్ కొరియోగ్రఫీ ఈ వీడియో సాంగ్‌ను విజువల్ వండర్‌గా మార్చాయి. ప్రస్తుతం ఈసాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, షార్ట్స్‌లో ఈ పాటలోని బీట్స్‌ను వాడుకుంటూ నేటి తరం నెటిజన్లు ట్రెండింగ్ రీల్స్ చేస్తున్నారు. 28 సంవత్సరాల క్రితం క్రియేట్ చేసిన ఒక సౌండ్, నేటికీ డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. తనతో చాలా సినిమాలు చేశా.. నయనతార కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆట సినిమాలో ఇలియనానను పెట్టుకున్నానని ఆ హీరోయిన్ అలిగింది.. నిర్మాత ఎం ఎస్ రాజు..

Follow Us