Trending Song: ప్రతి అబ్బాయిని ఏడిపించిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్‏లో ట్రెండింగ్..

సాధారణంగా సినిమా విజయంలో పాటల ప్రాముఖ్యత కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి మూవీ విడుదలకు ముందే రిలీజ్ అయ్యే పాటలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. కొన్ని సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ పాట మాత్రం సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Trending Song: ప్రతి అబ్బాయిని ఏడిపించిన సాంగ్.. ఇప్పటికీ యూట్యూబ్‏లో ట్రెండింగ్..
Nuvvante Pranamani Song

Updated on: Jan 20, 2026 | 8:47 AM

సినీరంగంలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీస్ చాలానే ఉంటాయి. ఇప్పటికీ ఎన్నిసార్లు చూసిన బోర్ కొట్టని చిత్రాలు.. ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. అలాగే కొన్ని పాటలకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉండదు. అలాంటి అరుదైన పాటలకు యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది. అయితే లవ్ సాంగ్స్ కంటే ఫెయిల్యూర్ సాంగ్స్ వినడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ప్రతి ప్రేమికుడి మనసును తాకే పాటలు కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ సైతం ఒకటి. దాదాపు 25 ఏళ్లుగా యూట్యూబ్ లో ట్రెండింగ్ సాంగ్ ఇది. 2004లో విడుదలైన ఆ మూవీకి ఇప్పటికీ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఆ పాట ఏంటీ ఆలోచిస్తున్నారా.. ? అప్పట్లో లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి కుర్రాడు ఈ పాట వింటూ ఎమోషనల్ అయిన సందర్బాలు ఉన్నాయి.

ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

యూత్ హృదయాల్లో ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోయిన సాంగ్ “నువ్వంటే ప్రాణమని.. నీతోనే లోకమని.. నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని.” గుర్తుకు వచ్చిందా.. ? తెలుగు సినిమా ప్రపంచంలో వచ్చిన బెస్ట్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ లో ఇది ఒకటి. ఈ పాటలోని ప్రతి పదం కుర్రాళ్ల మదిని తాకింది. వస్తానని చెప్పిన వెళ్లి ప్రియురాలి మరొకరి భార్యగా తిరిగి రావడం చూసి తట్టుకోలేకపోయిన కుర్రాడి వేదనే ఈ సాంగ్. 2004లో విడుదలైన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ సినిమాలోనిది. డైరెక్టర్ సీ. గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించారు. ఇందులో గోపిక, భూమిక, కనిహా, మల్లికా హీరోయిన్లుగా నటించారు. అలాగే సునీల్ కీలకపాత్ర పోషించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..

అప్పట్లో ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా లతికకు (గోపిక పాత్ర పేరు)కు పెళ్లి జరిగినప్పుడు వచ్చే ఈ సాంగ్ ఇప్పటికీ సంచలనమే. దాదాపు 25 ఏళ్లుగా యూట్యూబ్ లో ఈ పాట దూసుకుపోతుంది. ప్రేమికులకు, ప్రేమను కోల్పోయిన వారికి ఈ పాట స్పెషల్ ఎమోషన్ అని చెప్పొచ్చు. “వెంటొస్తనన్నావు.. వెళ్లొస్తానన్నావు.. జంటై ఒకరి పంటైయి వెళ్లావు ” అంటూ సాగే లిరిక్స్ ఇప్పుడు షార్ట్ వీడియోస్ రూపంలోనూ తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఈ సాంగ్ మీరు విన్నారా.. ?

ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..

ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..