Tollywood: స్టార్ హీరోయిన్ చెల్లెల్లు.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ సెన్సేషన్.. కానీ 21 ఏళ్లకే ఊహించని విషాదం..

సినీరంగంలో స్టా్ర్ హీరోయిన్ చెల్లెలు.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ కెరీర్ పీక్స్ లో ఉండగానే ఊహించని విధంగా 21 ఏళ్లకే తనువు చాలించింది. ఇప్పటికీ ఆమె మరణం ఇండస్ట్రీలో తీరని విషాదం. ఇంతకీ ఆమె ఎవరు.. ? ఆమె జీవితంలో ఎదురైన పరిస్థితులు ఏంటో తెలుసుకుందామా.

Tollywood: స్టార్ హీరోయిన్ చెల్లెల్లు.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ సెన్సేషన్.. కానీ 21 ఏళ్లకే ఊహించని విషాదం..
Simran

Updated on: May 27, 2025 | 12:09 PM

సినీ ప్రపంచం బయటి నుంచి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ వెండితెరపై అందం, అభినయంతో ఆకట్టుకునే తారల జీవితాలు మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటాయి. సినీరంగుల ప్రపంచంలో అనేక చీకటి కోణాలు ఉన్నాయి. ఇప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలు అనేకం ఉన్నాయి. నటిగా స్టార్ డమ్ అందుకోవాల్సిన ఓ అమ్మాయి 21 ఏళ్లకే తనువు చాలించింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఆమె.. ఆ తర్వాత కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సూసైడ్ చేసుకుని మరణించింది. ఆమె మరెవరో కాదు.. నటి మోనాల్. ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ చెల్లెలు. పార్వై ఓదే పోదామే సినిమాతో తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వాలెంటైన్స్ డే చిత్రంలో కునాల్ సరసన నటించింది. తొలి చిత్రంతోనే ఊహించిన గుర్తింపు సంపాదించుకుంది.

పవన్ కళ్యాణ్ నటించిన బద్రి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయగా.. విజయ్ సరసన నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాల్లో నటించింది. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషలలోనూ పలు సినిమాలు చేసింది. చివరగా ఆధికం అనే సినిమాలో నటించింది. కానీ ఆమె మరణించిన మూడేళ్లకు ఆ సినిమాను రిలీజ్ చేశారు.

నటిగా మోనాల్ కెరీర్ పీక్స్ లో ఉండగానే 2002 ఏప్రిల్ 14న చెన్నైలోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో ఆమె వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. మోనాల్ ఆత్మహత్య చేసుకున్న రోజు కూడా ఆమె తన నెక్ట్స్ మూవీ పూజ కార్యక్రమాల్లో పాల్గొంది. తన చెల్లెలు చనిపోవడానికి కారణం కొరియోగ్రాఫర్ ప్రసన్న సుజిత్ కారణమని.. తన ఆత్మహత్యలో నటి ముంతాజ్ ప్రమోయం కూడా ఉందని సిమ్రాన్ ఆరోపించడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలంపాటు మోనాల్ సూసైడ్ ఇష్యూ కొనసాగింది.

Simran Sister

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..