
ఇండస్ట్రీలో ప్రేక్షకులను కట్టిపడేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ‘ఆషిఖీ 2’, ‘మర్డర్ 2’ , ‘వో లమ్హే’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ఇందులోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. కానీ ప్రేక్షకులను కన్నీరు పెట్టించిన ఆ కథలకను.. తన జీవితంలో అవమానాన్ని మాత్రమే చూసిన ఓ మహిళ రాసిందని మీకు తెలుసా.. ? 7వ తరగతిలో ఫెయిల్ అయిన ఈ మహిళ, కాల్ గర్ల్‌గా పనిచేసింది. తన జీవితంలో ఎదురైన సవాళ్లను కాగితంపై పెట్టి ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకింది. ఈ రచయిత్రి పేరు షగుఫ్తా రఫిక్. ఆమె జీవితం ఒక సినిమాకు ఏమాత్రం తక్కువ కాదు. షగుఫ్తాను అన్వరీ బేగం దత్తత తీసుకున్నారు. ఇంతకుముందు సంపదతో నిండిన ఆ ఇల్లు, అకస్మాత్తుగా పేదరికంలోకి జారిపోయింది. తన తల్లి వీధుల్లో భిక్షాటన చేయడం చూసి 17 ఏళ్ల షగుఫ్తా గుండె పగిలిపోయింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆట సినిమాలో ఇలియనానను పెట్టుకున్నానని ఆ హీరోయిన్ అలిగింది.. నిర్మాత ఎం ఎస్ రాజు..
దీంతో ఆమె బడి మానేసి ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలోకి అడుగుపెట్టింది. మొదట ఆమె కాల్ గర్ల్‌గా పనిచేసింది, ఆ తర్వాత కొంతకాలం దుబాయ్‌లో బార్ డాన్సర్‌గా పనిచేసింది. దుబాయ్‌లో ఉన్నప్పుడు, 45 ఏళ్ల పాకిస్తానీ వ్యక్తి షగుఫ్తాకు ప్రపోజ్ చేశాడు. ‘ఆషిఖీ 2’లో ఆరోహి పడే కష్టంలో 30-40 శాతం షగుఫ్తా నిజ జీవితం ఆధారంగానే ఉందని ఆమె తెలిపింది. ఆ తర్వాత, 2002లో మహేష్ భట్‌ను కలవడంతో షగుఫ్తా జీవితం నిజమైన మలుపు తీసుకుంది. తన ‘వో లమ్హే’ అనుభవాన్ని పంచుకుంటూ షగుఫ్తా ఇలా అన్నారు, “నేను ఆ సినిమాకు సంతకం చేయడానికి రెండు రోజుల ముందు వరకు ఒక బార్‌లో డ్యాన్స్ చేస్తూ ఉండేదాన్ని. భట్ సాహెబ్ ఫోన్ చేసినప్పుడు, నేను ఇంటిని నడపాలి కాబట్టి నా డ్యాన్స్ ఉద్యోగాన్ని వదిలిపెట్టలేనని ఆయనకు చెప్పాను.” ఆ తర్వాత మనం ఇదే సన్నివేశాన్ని ‘ఆషిఖీ 2’లో చూశాం అని చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Ananya Nagalla : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అలాంటి భర్త రావాలి.. హీరోయిన్ అనన్య నాగళ్ల..
హిందీ చిత్రపరిశ్రమలో ఆమె ఆషిఖీ 2, వో లమ్హే, మర్డర్ 2, జన్నత్ 2, రాజ్ 2 , అవారాపన్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథలు అందించారు. ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్, మోస్ట్ వాంటెడ్ రచయిత్రి.
ఎక్కువ మంది చదివినవి : Chiranjeevi- Rajinikanth: రజినీకాంత్ హీరో.. చిరంజీవి విలన్.. కట్ చేస్తే.. అక్కడ బ్లాక్ బస్టర్..
Shagufta Rafique Pics
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో అతడే నా బెస్ట్ ఫ్రెండ్.. తనతో చాలా సినిమాలు చేశా.. నయనతార కామెంట్స్..