Tollywood: లావుగా ఉన్నావ్.. అందంగా లేదంటూ 13 సినిమాల నుంచి తీసేసారు.. ఇప్పుడు..

సినీరంగంలో ఒక్క సినిమా హిట్టయితే ఆ తారల క్రేజ్ ఎక్కడికి వెళ్తుందో చెప్పక్కర్లేదు. కానీ అంతకు ముందు కెరీర్ తొలినాళ్లలో మాత్రం ఎన్నో అవమానాలు, అడ్డంకులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ ఫిట్నెస్, లుక్స్ విషయంలో మాత్రం ఎన్నో విమర్శలు వస్తుంటాయి. ఒకప్పుడు విపరీతమైన అవమానాలు భరించి ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు కొందరు ముద్దుగుమ్మలు.

Tollywood: లావుగా ఉన్నావ్.. అందంగా లేదంటూ 13 సినిమాల నుంచి తీసేసారు.. ఇప్పుడు..
Vidya Balan

Updated on: Apr 17, 2025 | 3:49 PM

సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుంది. అలాగే వచ్చిన స్టార్ డమ్ కాపాడుకోవాలంటే సైతం అదే స్థాయిలో కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న తారలు గతంలో ఎన్నో అవమానాలు చూసినవారే. అడ్డంకులను ఛేదించి తమ సత్తాను నిరూపించుకోవడం అంటే సాధారణ పని కాదు. తాజాగా ఓ హీరోయిన్ అందంగా లేదని.. లావుగా ఉందంటూ ఆమెను ఏకంగా 13 సినిమాల నుంచి తీసేసారట. ఆమె వికారంగా ఉందని అవమానించారు. అయినప్పటికీ ఆమె నటించిన సినిమా రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. గ్లామర్ రోల్స్ కాకుండా విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆమె మరెవరో కాదు.. విద్యాబాలన్. బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చింది. కానీ సినిమా అవకాశాలు సైతం అంత తేలిగ్గా రాలేదు. కెరీర్ తొలినాళ్లలో ఆమెను 13 సినిమాల నుంచి తొలగించారు. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలన్ మాట్లాడుతూ.. “ఒక నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు. అతను నన్ను అసభ్యంగా పిలిచాడు. అతడు అవమానించిన తర్వాత నేను 6 నెలలు అద్దంలో ముఖం చూసుకోలేదు ‘ అంటూ చెప్పుకొచ్చింది. కానీ కాలం గడిచిపోయింది. తన సహజ నటనతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. దీంతో హిందీలో వరుస అవకాశాలు అందుకుంటూ విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. విద్యా బాలన్ మలయాళంలోనూ అవకాశాలు అందుకుంది.. కానీ సినిమా స్టార్ట్ కాకుండానే ఆమె నటించిన సినిమా ఆగిపోయింది. దీంతో ఆమెను దురదృష్టవంతురాలిగా అభివర్ణించారు. ఎదుటి వ్యక్తుల మాటలు తనపై తనకు ఉన్న నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేశాయని అన్నారు.

అలాగే సినిమా కోసం బరువు పెరుగుతున్న సమయంలోనూ ఆమెను బాడీ షేమింగ్ చేశారట. కానీ ఎదుటివారి మాటలు పట్టించుకోకుండా నటనపై దృష్టి పెట్టింది. 2010లో ఆమె నటించిన కహానీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?