Actress : లగ్జరీ లైఫ్, కోట్ల ఆస్తి వదిలేసి పర్వతాలలో నివసిస్తున్న స్టార్ హీరోయిన్.. కారణం ఇదే..

ఒకప్పుడు సినీరంగంలో టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్ వంటి స్టార్ హీరోయిన్లకు గట్టిపోటీ ఇచ్చింది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమా ప్రపంచం నుంచి తనను తాను దూరం చేసుకుంది. ఇప్పుడు ఆమె పర్వతాలలో నివసిస్తుంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Actress : లగ్జరీ లైఫ్, కోట్ల ఆస్తి వదిలేసి పర్వతాలలో నివసిస్తున్న స్టార్ హీరోయిన్.. కారణం ఇదే..
Barkha Madan

Updated on: Aug 07, 2025 | 2:14 PM

90వ దశకంలో బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేసిన తారలు.. తక్కువ సమయంలోనే అపారమైన స్టార్ డమ్ సంపాదించుకున్నారు. భారతీయ సినిమాల్లో చరిత్ర సృష్టించిన తారలు.. ఐశ్వర్య రాయ్, రాణి ముఖర్జీ, కాజోల్ నుండి సుష్మితా సేన్, దివ్య భారతి, పూజా బాత్రా, నగ్మా వరకు.. ఎంతో మందితారలు 90లలో కెరీర్ స్టార్ట్ చేశారు. అప్పట్లో స్టార్ హీరోయిన్స్ మధ్య ఎంతో పోటీ ఉండేది. అటు సినిమాల విషయంలో, అందం, ఫిట్నెస్, లుకింగ్ పరంగానూ తారల మధ్య పోటీతత్వం ఉండేది. కానీ మీకు తెలుసా.. ? ఒకప్పుడు టాప్ హీరోయిన్.. కానీ కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్ వదిలేసి ఇప్పుడు పర్వతాలలో నివసిస్తుంది. సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన ఆ అందాల రాణి గురించి మీకు తెలుసా.. ? మె బర్ఖా మదన్.

ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..

ఇవి కూడా చదవండి

1996లో విడుదలైన అక్షయ్ కుమార్ చిత్రం ‘ఖిలాడియోం కా ఖిలాడి’ ద్వారా బర్ఖా మదన్ తన అరంగేట్రం చేసింది. ఇందులో రేఖ, రవీనా టాండన్, ఇందర్ కుమార్, గుల్షన్ గ్రోవర్ వంటి స్టార్ కీలకపాత్రలు పోషించారు. కానీ 2003లో విడుదలైన ‘భూత్’ ఆమె కెరీర్‌కు ఒక మలుపు తిరిగిన చిత్రం. అందులో దెయ్యం పాత్రను పోషించింది. ఈ చిత్రంలో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. ఆ తర్వాత ఆమెకు హిందీలో అనేక ఆఫర్స్ వచ్చాయి. ‘తేరా మేరా ప్యార్’, ‘సమయ్: వెన్ టైమ్ స్ట్రైక్స్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. సినిమాలే కాకుండా బుల్లితెరపై పలు సీరియల్స్, టీవీ షోలలో పాల్గొంది. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే సినిమాలకు దూరమైంది.

ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..

2012 లో సన్యాసిగా మారాలని తన నిర్ణయంతో అందరిని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఆమె బౌద్ధ మతంలోకి చేరి సన్యాసిగా తన జీవితాన్ని గడుపుతుంది. విలాసవంతమైన జీవనశైలిని వదిలి, ఆమె తన జీవితాన్ని పర్వతాలు, నదుల ఒడ్డున గడుపుతోంది. బర్ఖా మదన్ సినిమాలు, నటనకు దూరంగా ఉంది, కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్‏తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..