
ఒకప్పుడు భారతీయ సినిమా ప్రపంచంలో ఆమె టాప్ హీరోయిన్. కట్టిపడేసే అందం.. చూడచక్కని రూపంతో కుర్రాళ్ల హృదయాలు దోచుకుంది. తెలుగు, హిందీ భాషలలో స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఇప్పుడు క్రికెట్ లో పెట్టుబడులు పెట్టి భారీగా సంపాదిస్తుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ప్రీతి జింటా. సినిమాల్లో నటించడమే కాకుండా ఇప్పుడు క్రీడల్లోనూ ఆసక్తి చూపిస్తుంది. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ… ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ కు యజమాని. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో చక్రం తిప్పిన ఆమె.. ఇప్పుడు ఐపీఎల్ ద్వారా ఎక్కువగా రాబడుతున్నారు. ఐపీఎల్ జట్టు యజమానులకు దాదాపు 80 శాతం వాటా లభిస్తుంది. అలాగే వారికి స్పాన్సర్ షిప్ సైతం ఉంటుంది.
2008లో పంజాబ్ కింగ్స్ జట్టును 76 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు ప్రీతి. 2022లో ఈ విలువ రూ.925 డాలర్లకు పెరిగింది. ఈ జట్టు కోసం ప్రీతి ఏకంగా రూ.35 కోట్ల వరకు పెట్టుబడి పెట్టింది. ఇప్పుడు నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.350 కోట్లకు పైగానే పెరిగింది. మహేష్ బాబు సరసన రాజకుమారుడు, వెంకటేశ్ జోడిగీ ప్రేమంటే ఇదేరా వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్న ఈ భామ.. ఎక్కువగా హిందీలో నటించింది. ప్రీతి ఒక బ్రాండ్ ప్రమోట్ చేయడానికి దాదాపు రూ.1.5 కోట్లు తీసుకుంటుందట.
అలాగే ఆమెకు ముంబైలో 17 కోట్ల విలువైన ఇల్లు ఉంది. అలాగే సిమ్లాలోనూ సొంతంగా ఇల్లు ఉందట. దాని విలువ రూ.7 కోట్లు ఉంటుందని సమాచారం. కెరీర్ ఫాంలో ఉండగానే.. జీన్ గుడ్ ఎనఫ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ప్రీతి. వీరికి ఇద్దరు కవలలు ఉన్నారు. ప్రస్తుతం తన భర్తతో కలిసి లాస్ ఏంజిల్స్ లో ఉంటుంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..