Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..

చిన్నప్పటి నుంచి ఆమెకు నటనపై ఆసక్తి లేదు. కానీ తల్లి బలవంతం మీద ఇండస్ట్రీలోలికి అడుగుపెట్టింది. బాలనటిగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అంతేకాదు.. అప్పట్లో శ్రీదేవికి వాయిస్ ఓవర్ అందించింది. కానీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు చూసింది. ఆమె అద్భుతమైన జీవితం.. విషాదకరమైన జీవితం అకాల ముగింపుకు చేరుకుంది.

Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..
Kumari Naaz

Updated on: Oct 20, 2025 | 1:23 PM

చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తల్లి బలవంతం మీద ఇండస్ట్రీలోకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చి నాలుగేళ్ల వయసులోనే అందరి దృష్టిని ఆకర్షించింది. చిన్నప్పటి నుంచి ఆమెకు నటనపై అంతగా ఆసక్తి ఉండేది కాదు. కానీ కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమెను నాలుగేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి తీసుకువచ్చింది ఆమె తల్లి. తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే బాల నటులలో ఒకరిగా మారింది. వెండితెరపై అద్భుతమైన సక్సెస్ చూసిన ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం అంత సాఫీగా సాగలేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటి పేరు కుమారి నాజ్. చిన్నప్పుడు ఆమెను బేబీ నాజ్ అని పిలిచేవారు. చాలా చిన్న వయసులోనే నటించడం ప్రారంభించింది. తన అమాయక నటనతో మొత్తం సినీప్రియుల హృదయాలను గెలుచుకుంది. తెరపై ఆమె చిరునవ్వు ఎంత అందంగా ఉందో, తెరవెనుక ఆమె జీవితం కూడా అంతే కష్టాలతో నిండి ఉంది.

ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..

1980లలో హిందీ చిత్రాలలో సూపర్ స్టార్ శ్రీదేవికి వాయిస్ ఓవర్ అందించింది. కుమారి నాజ్ ఆగస్టు 20, 1944న ముంబైలో జన్మించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నాలుగు సంవత్సరాల వయస్సులో స్టూడియోలలో షూటింగ్ ప్రారంభించింది. ఆమె 1950 చిత్రం అచ్ఛా జీతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. తర్వాత హిందీలో అనేక చిత్రాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. దేవదాస్, గంగా జమునా, కాగజ్ కే ఫూల్ , ముసాఫిర్ వంటి సీరియస్ చిత్రాలలో ఆమె ముఖ్యమైన పాత్రలు పోషించింది. అయితే కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉండగానే ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా రెండవ కెరీర్‌ను ప్రారంభించింది. 1980లలో శ్రీదేవికి వాయిస్ ఓవర్ అందించింది.

ఇవి కూడా చదవండి : Actress: చిరంజీవి, కమల్ హాసన్‏తో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు.. ఈ బ్యూటీ క్రేజ్ వేరప్పా..

హిందీలో సినిమాలు చేస్తున్న సమయంలో శ్రీదేవికి తన వాయిస్ అందించింది. హిమ్మత్‌వాలా, తోఫా, మావాలి వంటి హిట్‌ చిత్రాల్లో శ్రీదేవికి వాయిస్ ఓవర్ అందించింది. ఆమె గొంతులో అమాయకత్వం, వాయిస్ శ్రీదేవి పాత్రలకు సరిగ్గా సరిపోయేలా ఉంది. 1963లో, నాజ్ నటుడు సుబ్బిరాజ్‌ను వివాహం చేసుకుంది. అతను రాజ్ కపూర్ బంధువు. వివాహం తర్వాత హిందూ మతంలోకి మారి అనురాధగా పేరు మార్చుకుంది. ఆమె కెరీర్ మొత్తంలో, ఆమె 200 కి పైగా చిత్రాలలో నటించింది. కొన్నాళ్లకు ఆమె కాలేయ వ్యాధితో బాధపడింది. కొన్నాళ్లపాటు కోమాలో ఉన్న ఆమె.. అక్టోబర్ 19, 1995న మరణించింది.

Kumari Naaz Mvoie

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..