
శక్తివంతమైన సినిమా పాత్రల నుండి వెబ్ సిరీస్‌లలో అద్భుతమైన ప్రదర్శనల వరకు తనదైన నటనతో ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేశారు నటి రసిక దుగ్గల్. ఆమె ప్రతి పాత్రకు తన అద్భుతమైన నటనతో ప్రాణం పోసింది. “మిర్జాపూర్” వెబ్ సిరీస్ నటి కెరీర్‌లో కొత్త కోణాన్ని చూపించింది. మీర్జాపూర్ సిరీస్ లో పితృస్వామ్య కుటుంబంలో నివసించే సంక్లిష్టమైన స్త్రీ పాత్రను పోషించిందిఇంట్లో అణచివేతకు గురవుతూ, తన భర్తకు ఎలాగైనా విధేయత చూపించవలసి వచ్చే స్త్రీ పాత్రను ఆమె పోషిస్తుంది. తన ఆశయాల కోసం చివరికి పోరాడే స్త్రీగా రసిక తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
అలాగే ఢిల్లీ క్రైమ్ చిత్రంలో పోలీసు అధికారిణిగా నీతూ సింగ్ పాత్రలో కనిపించింది. ఒక క్రూరమైన నేరాన్ని దర్యాప్తు చేస్తున్నప్పుడు ఆమె ఎదుర్కొనే భావోద్వేగ పోరాటాలను చూపించింది. ఒక స్త్రీ తన విధిని నిర్వర్తిస్తున్నప్పుడు తన అమాయకత్వాన్ని ఎలా కోల్పోతుందో చిత్రీకరించే ఈ పాత్ర ప్రేక్షకులతో ఆకట్టుకుంద. హమీద్ చిత్రం జాతీయ అవార్డును గెలుచుకుంది. రసిక దుగ్గల్ తన భర్త కోసం వెతుకుతున్న మహిళ పాత్ర పోషించింది. ఆమె పోరాటం విమర్శకుల హృదయాలను గెలుచుకుంది. ఈ చిత్రంలో నటి నటనకు ప్రశంసలు లభించాయి.
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..
కిస్సా చిత్రంలో, రసిక ఒక వింతైన,బాధాకరమైన కుటుంబ పరిస్థితిలో చిక్కుకున్న నీలి అనే సంక్లిష్టమైన , సున్నితమైన పాత్రను పోషించింది అలాగే ఎ సూటబుల్ బాయ్, లూట్‌కేస్, మాంటో వంటి చిత్రాలతో అద్భుతమైన నటనతో.. వైవిధ్యమైన పాత్రలతో కట్టిపడేసింది. ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతుంది.
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..