తోపు హీరోయిన్.. సీఎం కొడుకుతో ప్రేమ పెళ్లి.. 11 రోజుల్లోనే చనిపోయిన భర్త.. చివరకు 20 ఏళ్ల పెద్దవాడితో..
నిజానికి వెండితెరపై కనిపించిన నటీనటుల జీవితాలు అంత అందంగా సాగవు. రియల్ లైఫ్ లో ఎన్నో సవాళ్లను, కష్టాలతో సాగుతాయి. ఇక ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన తారల కెరీర్ పీక్స్ లో ఉండగా ప్రేమ, పెళ్లి వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ లైఫ్ సైతం ఎన్నో మలుపులు తిరిగింది.

సినిమా రంగంలో మెరిసే తారల వెనుక ఎన్నో విషాద కథలు ఉంటాయి. తెరపై సందడి చేసే ప్రముఖ నటీనటుల వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో విషాద గాథలు ఉంటాయి. ఈమె కూడా అలాంటి నటీమణులలో ఒకరు. ముఖ్యమంత్రి కుమారుడిని పెళ్లి చేసుకున్న ఆ మహిళకు 11 రోజుల్లోనే ఒక పెద్ద షాక్ తగిలింది. మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ పేరు లీనా చందావార్కర్. 70, 80వ దశకాలలో బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన నటి. లీనా కర్ణాటకలోని ఒక సైనికుల కుటుంబంలో జన్మించారు. 1968లో విడుదలైన ‘మా కా మీత్’ చిత్రంతో ఆమె నటిగా పరిచయమయ్యారు. ఆ కాలంలో సూపర్‌స్టార్ నటుడిగా పేరుగాంచిన వినోద్ ఖన్నా ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించారు. విడుదలైనప్పుడు ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత లీనా, ప్రముఖ నటులైన రాజేష్ ఖన్నా ,దిలీప్ కుమార్‌లతో కలిసి నటించి, రాత్రికి రాత్రే మంచి పేరు సంపాదించింది. తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు, ఆమె రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చిన సిద్ధార్థ్‌ను కలిసింది.
ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు
వారిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. అప్పుడు లీనా వయసు 24 ఏళ్లు. లీనా భర్త సిద్ధార్థ్, గోవా మొదటి ముఖ్యమంత్రి బందోద్కర్ కుమారుడు. సినిమా రంగంలో అగ్ర నటి. ముఖ్యమంత్రి కుమారుడితో వివాహం. విలాసవంతమైన జీవితం. లీనా తన వైవాహిక జీవితాన్ని ఎన్నో కలలతో ప్రారంభించింది. కానీ కాలం ఆమెకు మరో విషాదాన్ని బహుమతిగా ఇచ్చింది. వారి పెళ్ళయిన 11వ రోజున లీనా భర్త సిద్ధార్థ్ మరణించాడు. తుపాకీని శుభ్రం చేస్తుండగా అది అనుకోకుండా పేలిపోయింది. సిద్ధార్థ్ అక్కడికక్కడే మరణించాడు. లీనా కూడా తన పుట్టింటికి తిరిగి వచ్చేసింది. నిందలన్నీ లీనాపై పడ్డాయి. దురదృష్టవంతురాలని చాలా మంది ఆమెను నిందించారు.
ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‌కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
లీనా సినిమా రంగంలోకి తిరిగి వచ్చారు. కానీ, ఆమె నటించిన ‘బైరాగ్’ చిత్రం పరాజయం పాలైంది. ఆ సమయంలో ఆమెకు నటుడు కిషోర్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఇక కిషోర్ కుమార్ విషయానికొస్తే, అతను లీనా కంటే 20 ఏళ్లు పెద్దవాడు. అతనికి మూడుసార్లు విడాకులు అయ్యాయి. అతని వివాహాన్ని అతని కుటుంబం వ్యతిరేకించింది. అయినప్పటికీ, అతను కూడా వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం లీనా వయసు 75 ఏళ్లు. మరింత విషాదకరమైన విషయం ఏమిటంటే, వారి వివాహం జరిగిన ఏడేళ్లలోపే కిషోర్ కుమార్ కూడా మరణించారు.
ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు
లీనా చందావార్కర్..

Leena Chandavarkar News
ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‌కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..
