
హిందీ సినిమా ప్రపంచంలో ఆమె అత్యధిక డిమాండ్ ఉన్న నటి. దాదాపు రెండు దశాబ్దాలుగా వరుస సినిమాలు, సీరియల్స్ ద్వారా అలరిస్తుంది. ఆమె మరెవరో కాదు.. టీవీ నటి శ్వేతా తివారీ. ఈరోజు ఆమె 45వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన విషయాలు నెట్టింట వైరలవుతున్నాయి. శ్వేత సెయింట్ ఇసాబెల్ హై స్కూల్‌లో తన చదువును పూర్తి చేసింది. ఆ తరువాత, ఆమె ముంబైలోని మజ్గావ్‌లోని బుర్హానీ కళాశాల నుండి బి.కామ్ డిగ్రీని కంప్లీట్ చేసింది. శ్వేత 1999లో దూరదర్శన్‌లో కలీరీన్ అనే సీరియల్‌తో టెలివిజన్ రంగప్రవేశం చేసింది.
ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?
12 ఏళ్ల వయసులోనే పనిచేయడం ప్రారంభించింది. అప్పట్లో తాను రూ.500 జీతంకు వర్క్ చేసినట్లు గతంలో చెప్పుకొచ్చింది. ఏక్తా కపూర్ బాలాజీ టెలిఫిల్మ్స్ నిర్మించిన రొమాంటిక్ డ్రామా కసౌతి జిందగీ కేలో శ్వేత ప్రేరణ శర్మ పాత్రను పోషించింది. ఈ సీరియల్ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత, పర్వారిష్, మేరే డాడ్ కి దుల్హన్, బాల్వీర్ వంటి అనేక ఇతర ప్రధాన టెలివిజన్ షోలలో నటించడంతో ఆమెకు మరింత ఫాలోయింగ్ వచ్చింది.
ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..
2010లో, ఆమె బిగ్ బాస్ విజేతగా నిలిచిన మొదటి మహిళా పోటీదారుగా నిలిచింది. ఆమె వ్యక్తిగత జీవితం సవాళ్లతో నిండి ఉంది, ఎందుకంటే ఆమె రెండు సార్లు విడాకులు తీసుకుంది. రాజా చౌదరితో ఆమె మొదటి వివాహం 9 సంవత్సరాల తర్వాత అతడితో విభేదాలు రావడంతో డివోర్స్ తీసుకుంది. తర్వాత అభినవ్ కోహ్లీ ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరు 2019లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం తన కూతురు, కొడుకుతో కలిసి ఒంటరిగా ఉంటుంది. 45 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్ విషయంలో హీరోయిన్లకు గట్టిపోటినిస్తుంది.
ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..