Tollywood: 17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. 23 ఏళ్లకే హోటల్లో అడ్డంగా దొరికి.. రహస్యంగా పెళ్లి, విడాకులు.. ఎవరంటే..

|

Dec 28, 2024 | 5:14 PM

చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టి కథానాయికగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. కానీ ఊహించని విధంగా ఈ బ్యూటీ కెరీర్ డౌన్ అయ్యింది. దీంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా..

Tollywood: 17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. 23 ఏళ్లకే హోటల్లో అడ్డంగా దొరికి.. రహస్యంగా పెళ్లి, విడాకులు.. ఎవరంటే..
Swetha Basu Prasad
Follow us on

సినీరంగంలో హీరోయిన్‏గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కథానాయికగా తొలి చిత్రంతోనే క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ అనుకోని విధంగా వివాదాలతో ఆమె కెరీర్ పడిపోయింది. 17 ఏళ్లకే స్టార్ హీరోయిన్ అయ్యింది.. కానీ 23 ఏళ్లకే ఆమె క్రేజ్ కాస్త పడిపోయింది. ఆ నటి మరెవరో కాదు.. శ్వేతా బసు ప్రసాద్. 2002లో బాలీవుడ్ చిత్రం మక్టీలో బాలనటిగా రంగప్రవేశం చేసింది. ఆ తర్వాత కహానీ ఘర్ ఘర్ కీ అనే టీవీ సీరియల్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇక ఆ తర్వాత తెలుగులో కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. అంతేకాకుండా ఈ మూవీలో తనదైన నటనతో అప్పట్లో కుర్రకారును ఉర్రూతలూగించింది.

దీంతో ఈ సినిమా తర్వాత తెలుగులో శ్వేత స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు అంతా. కానీ అలా కాకుండా ఆమెకు తెలుగులో ఆఫర్స్ అంతగా రాలేదు. శ్వేత నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. శ్వేత కేవలం నటి మాత్రమే కాదు. రచయిత్రి, డాక్యుమెంటరీ డైరెక్టర్, నిర్మాత కూడా. 1991 జనవరి 11న జంషెడ్‌పూర్‌లో జన్మించిన శ్వేత చిన్నతనంలోనే ముంబైకి వచ్చింది. 2004లో హైదరాబాద్ లో ఓ స్టార్ హోటల్లో ఈ బ్యూటీ దొరికిపోయిందని అప్పట్లో వార్తలు సెన్సేషన్ అయ్యాయి. ఓ కేసులో ఈ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు కొన్ని నెలల తర్వాత ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే తన గురించి వార్తలు మొత్తం అవాస్తవమని శ్వేత అన్నారు.

2018లో ఓ వ్యక్తిని రహాస్యంగా పెళ్లి చేసుకుంది శ్వేత. కానీ వీరి బంధం 9 నెలలకే ముగిసింది. 23 వయసులోనే పెళ్లి.. ఆ తర్వాత విడాకులు తీసుకున్న శ్వేత.. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ అయ్యింది.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.