Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..

సినీరంగుల ప్రపంచంలో తమకంటూ ఓ గుర్తింపు కోసం ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసిన నటీనటులు చాలా మంది ఉన్నారు. అప్పటికే వివిధ రంగాల్లో సెటిల్ అయినవారు.. నటనపై ఆసక్తితో తాము చేస్తున్న పనిని పక్కనపెట్టి సినీరంగంలోకి అడుగుపెట్టారు. అలాంటి వారిలో ఈ నటుడు ఒకరు. ఏకంగా కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలేశారట.

Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
Vadlamani Srinivas

Updated on: Jan 24, 2026 | 10:52 AM

ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలనే కలలతో ఎంతోమంది వస్తుంటారు. అయితే అందులో ఎవరిని ఎప్పుడు అదృష్టం వరిస్తుందో చెప్పలేం. కొందరు తాము చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలను వదిలేసి సినీరంగంలోకి వచ్చి సక్సెస్ అయ్యారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు ఒకరు. ఇప్పుడిప్పుడే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని.. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్నారు. కానీ ఒకప్పుడు అతడు విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. అతడి పేరు వడ్లమాని శ్రీనివాస్. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు. కానీ వెండితెరపై అతడు కనిపిస్తే ఆయన నటనకు అభిమానులు ఉన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trivikram : ఆ పాట విని ఆశ్చర్యపోయా.. తెలుగు డిక్షనరీ కొని మరీ అర్థం వెతికాను.. త్రివిక్రమ్ శ్రీనివాస్..

నటుడు వడ్లమని శ్రీనివాస్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ తన సినీ ప్రస్థానాన్ని, ఐఏఎస్ నుండి ప్రభుత్వ సేవను విడిచిపెట్టి సినిమా రంగంలోకి ప్రవేశించిన విధానాన్ని వివరించారు. వైజాగ్‌లో పీడీ డీఆర్డీఏగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆయన మహిళా సంఘాలతో చురుకుగా పనిచేశారు. ఈ సమయంలోనే ఓ జర్నలిస్ట్ సోదరుడు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ద్వారా తొలి సినిమా అవకాశం లభించిందని తెలిపారు. అదే రారండోయ్ వేడుక చూద్ధాం సినిమా. ఆ తర్వాత గీతా గోవిందం, ప్రతిరోజు పండగే, శైలజా రెడ్డి అల్లుడు, పాగల్, డియర్ కామ్రేడ్, వీ, వకీల్ సాబ్, ఎఫ్ 2 ఇలా దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించారు. తండ్రిగా, హస్యనటుడిగా, విలన్ గా ఇలా వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Ravi Babu: అంత కష్టపడి సినిమా తీస్తే నిర్మాత మోసంతో ఎవరినీ నమ్మలేకపోతున్నా.. నటుడు రవిబాబు ..

గంగవరం పోర్ట్ చిత్రంలో కేవలం 20 సెకన్ల నిడివి గల చిన్న పాత్రలో, జగపతి బాబు గారికి షేక్ హ్యాండ్ ఇచ్చే పోర్ట్ చైర్మన్ పాత్రను పోషించారు. ఇది ఆయన తొలి చిత్ర అనుభవం. అయితే ఆయనకు నిజమైన గుర్తింపు, ప్రభావవంతమైన పాత్ర దర్శకుడు మారుతి గారి మహానుభావుడు చిత్రంలో లభించింది. మారుతి ల్యాండ్ డీల్‌లో సహాయం చేసినందుకు కృతజ్ఞతగా ఆయన ఈ అవకాశం కల్పించారు. సినిమాల్లోకి రాకముందు వైజాగ్ జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు. కానీ చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో.. ఒక గురువు సలహా మేరకు ప్రజల పరిపాలనను విడిచిపెట్టి సినిమా రంగంలోకి రావాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Trivikram Srinivas: అతడు కెమెరా కోసమే పుట్టాడు.. నాకు ఇష్టమైన హీరో.. త్రివిక్రమ్ ప్రశంసలు..

ఎక్కువ మంది చదివినవి : అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన సాంగ్.. భాష అర్థం కాకపోయినా కుర్రాళ్లకు పిచ్చెక్కించేసింది.. ఆ గ్లామర్ హీరోయిన్ ఏం చేస్తుందంటే..