
సినీరంగంలో నటుడిగా ఓ వెలుగు వెలగాలని ఎంతో మంది అనేక కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. కానీ అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. అలాంటి వారిలో ఈ హీరో ఒకరు. అతడు వీధుల్లో నీళ్లు అమ్ముకునేవారు, హోటళ్లలో పనిచేసేవారు. తినడానికి తిండి లేక వడాపావ్ తింటూ బతికాడు. చిన్నప్పటి నుంచే సినిమాల్లో హీరో కావాలని కలలు కనేవాడు. తన కలల వెంట పరుగులు పెడుతూనే సినీరంగం గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. దాదాపు 10 ఏళ్ల పాటు కష్టపడి, బాక్సాఫీస్ వద్ద 400 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమా తీసి, జాతీయ అవార్డు గెలుచుకుని స్టార్ అయ్యాడు. ఆ చిత్రం, అతని నటన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. అతడు మరెవరో కాదు.. కన్నడ హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి. దక్షిణ భారతదేశంలోని కెరాడి అనే ఒక చిన్న గ్రామంలో 1983లో జన్మించిన రిషబ్ శెట్టి ఒక నిరుపేద కుటుంబంలో పెరిగాడు. చిన్నప్పటి నుంచే అతనికి తన ప్రాంతపు జానపద కళ అయిన యక్షగానం పట్ల, కథలు చెప్పడం పట్ల ఎక్కువ అభిరుచి ఉండేది. ఈ అభిరుచే అతనిలోని కళాకారుడిని సజీవంగా ఉంచి, సినిమా ప్రపంచం వైపు ఆకర్షించింది.
ఎక్కువ మంది చదివినవి : Kajal : నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు.. హీరోయిన్ కాజల్..
బెంగళూరులో బీ.కామ్ పూర్తి చేసిన తర్వాత, రిషబ్‌కు ఒక స్థిరమైన ఉద్యోగం సంపాదించడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. కానీ అతడు సినీరంగం వైపు అడుగులు వేశాడు. బెంగళూరు వంటి పెద్ద నగరంలో తనను తాను పోషించుకోవడానికి దొరికిన ఏ పనినైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. బెంగళూరులోని వీధుల్లో 20-లీటర్ల మినరల్ వాటర్ క్యాన్‌లను అమ్మడం ప్రారంభించాడు. సినీరంగంలో అవకాశాల కోసం ఎదురుచూస్తూనే తనకు వచ్చిన పని చేయడం స్టార్ట్ చేశాడు. రిషబ్ హోటళ్లలో కూడా పనిచేశాడు. అతను టీ పొడి అమ్మడం నుండి సోలార్ ప్యానెళ్ల మార్కెటింగ్, రియల్ ఎస్టేట్ వరకు అన్నింటిలోనూ ప్రవేశించి, దాదాపు ఒక దశాబ్దం పాటు చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని పనులూ చేశాడు.
ఎక్కువ మంది చదివినవి : Trisha : ఆ హీరోను చూసి చాలా గిల్టీగా ఫీలయ్యా.. అతడంటే చాలా ఇష్టం.. హీరోయిన్ త్రిష కామెంట్స్..
అలాగే సినిమా గురించి తెలుసుకోవడానికి ముంబై వెళ్లాడు. అక్కడ అతను సినిమా నిర్మాతలకు డ్రైవర్‌గా, అంధేరి ఆఫీసులలో ఆఫీస్ బాయ్‌గా పనిచేశాడు. ఆ రోజుల్లో, కడుపు నిండా తినడానికి కూడా అతని దగ్గర డబ్బులు ఉండేవి కావు, అందుకే అతను తరచుగా రోజంతా వడా పావ్ మాత్రమే తింటూ గడిపేవాడు. బెంగళూరులోని ప్రభుత్వ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఫిల్మ్ డైరెక్షన్‌లో డిప్లొమా సంపాదించి, కన్నడ చిత్రసీమలో క్లాప్ బాయ్‌గా, స్పాట్ బాయ్‌గా, సహాయ దర్శకుడిగా పనిచేయడం ప్రారంభించారు. 2016లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం “కిరిక్ పార్టీ”తో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత రిషబ్ శెట్టి కెరీర్ మలుపు తిప్పిన సినిమా కాంతార. 2022లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన కాంతార చాప్టర్ 1 సైతం ఆకట్టుకుంది.
ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu : ఇప్పుడున్న హీరోలలో అతడంటే చాలా ఇష్టం.. మాట ఇస్తే నిలబెట్టుకుంటాడు.. జగపతి బాబు..
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను.. ఉదయాన్నే 5 గంటల వరకే.. మురళిమోహన్ కామెంట్స్..