Tollywood : ఒకప్పుడు వీధుల్లో పోస్టర్స్ పంచాడు.. ఇప్పుడు పాన్ ఇండియానే షేక్ చేస్తున్న హీరో.. తెలుగులో చాలా ఫేమస్..

ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేదు. కానీ నటనపై ఆసక్తి. అందుకే చేస్తున్న ఉద్యోగం వదిలేసి సినీ రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మొదట్లో హీరోల స్నేహితుడిగా చిన్న చిన్న పాత్రలు పోషించాడు. ఇప్పుడు హీరోగా పాన్ ఇండియా బాక్సాఫీస్ నే షేక్ చేస్తున్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇంతకీ అతడు ఎవరంటే..

Tollywood : ఒకప్పుడు వీధుల్లో పోస్టర్స్ పంచాడు.. ఇప్పుడు పాన్ ఇండియానే షేక్ చేస్తున్న హీరో.. తెలుగులో చాలా ఫేమస్..
Vijay Sethupathi

Updated on: Apr 07, 2026 | 7:23 AM

సినీరంగంలో తమ కలలు సాకారం చేసుకోవాలని ఎంతోమంది నటీనటులు అడుగుపెడుతుంటారు. అధిక జీతాలు వచ్చే కార్పొరేట్ ఉద్యోగాలను వదిలేసి మరీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తారలను చూస్తుంటాం. అయితే అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. వరుస అవకాశాలు అందుకుంటూ నటీనటులుగా ప్రశంసలు అందుకుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో ఒకరు. అతడు నటుడిగా సక్సెస్ అయ్యాడు. హీరోగానూ మెప్పించాడు. ఇక విలన్ పాత్రలో అదరగొట్టాడు. కానీ ఒకప్పుడు రోడ్డులో పాంప్లేట్స్ పంచాడు. ఆ తర్వాత దుబాయ్ లో కొన్నాళ్లు జాబ్ చేశాడు. అతడు మరెవరో కాదండి.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. తాను పోషించే ప్రతి పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించడంలో బలమైన పేరు సంపాదించుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Ram Gopal Varma : ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే.. అందుకే ఆ రేంజ్‏లో ఉన్నాడు.. రామ్ గోపాల్ వర్మ..

2000వ దశాబ్దం ప్రారంభంలో విజయ్ సేతుపతి దుబాయ్‌లో అకౌంటెంట్‌గా పనిచేశారు. ఆ సమయంలో, ఆయన నెలకు సుమారు 1,300 దిర్హమ్‌లు సంపాదించేవారని, ఇది దాదాపు రూ. 33,000కు సమానం. స్వదేశంలోని తన కుటుంబాన్ని పోషించడానికి ఆ జీతం సరిపోలేదు. కుటుంబాన్ని పోషించడానికి, ఆయన తన రెగ్యులర్ ఉద్యోగంతో పాటు అదనపు పార్ట్-టైమ్ పనులు చేసేవాడట. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ సేతుపతి.. తన కష్టాల గురించి చెప్పుకొచ్చాడు. సంపాదన కోసం షేక్ జాయెద్ రోడ్డు వెంబడి వీధుల్లో ప్రకటనల కరపత్రాలను పంచిపెట్టేవాడినని అన్నారు. ఇంటికి డబ్బు పంపడానికి, వీలైన చోటల్లా నిరంతరం చిన్న చిన్న పనుల కోసం వెతుకుతూ ఉండేవాడినని తెలిపారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దుబాయ్‌కి వెళ్లానని, కానీ బతకడమే ఒక సవాలు తెలుసుకున్నానని.. అలవెన్సులతో సహా తన నెలసరి సంపాదన అవసరాలకు సరిపోకపోవడంతో, అందుబాటులో ఉన్న ఏ రకమైన పార్ట్‌టైమ్ పని కోసమైనా ప్రజలను సంప్రదించేవాడినని చెప్పుకొచ్చాడు.

ఎక్కువమంది చదివినవి : Kichcha Sudeep: ఆర్జీవీ లేకపోతే నాకు సినిమా అవకాశాలు వచ్చేవే కాదు.. అసలు విషయం చెప్పిన కిచ్చా సుదీప్..

అప్పటికే తనకు నటనపై ఆసక్తి ఉండడంతో ఉద్యోగాన్ని వదిలి ఇండియాకు వచ్చి సినీరంగంలోకి అడుగుపెట్టానని అన్నారు. ఎలాంటి సపోర్ట్ లేకపోయినప్పటికీ.. ఎన్నో సవాళ్లు కష్టాలు, అవమానాలు దాటుకుని ఒక్కో చిన్న అవకాశాన్ని అందిపుచ్చుకున్నట్లు తెలిపారు. తెలుగులో ఉప్పెన సినిమాలో రాయనం పాత్రతో పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత హిందీలో జవాన్ మూవీతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఎక్కువమంది చదివినవి : Cinema OTT: దృశ్యం సినిమా కంటే 100 రెట్లు ఎక్కువ సస్పెన్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఎక్కువమంది చదివినవి : Tanikella Bharani: ఆ హీరో వయసులో చిన్నోడు.. కానీ చేతులెత్తి నమస్కరిస్తున్నా.. తనికెళ్ల భరణి కామెంట్స్..

Follow Us