
సినీరంగంలో హీరోగా పాపులర్ కావడమంటే అతిశయోక్తి కాదు. తక్కువ సమయంలోనే తమకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం.. ఆ స్టా్ర్ డమ్ కొనసాగించడం సైతం పెద్ద సవాలు. కానీ మీకు ఓ హీరో గురించి తెలుసా.. ? మొదటి సినిమాకు రూ.4 లక్షలు పారితోషికం తీసుకున్నాడు. కానీ ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.150 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడు. ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఒకే ఒక్క సినిమాతో పాన్-ఇండియా నటుడిగా మారాడు. ఆ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు సినీరంగంలోకి అడుగుపెట్టి 24 సంవత్సరాలు అయ్యింది. రెండు దశాబ్దాలకు పైగా సినీరంగంలో చక్రం తిప్పుతున్నాడు. అతడు మరెవరో కాదు.. హీరో ప్రభాస్.
ఈశ్వర్ సినిమాతో హీరోగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. తొలి చిత్రంతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. అగ్ర కథానాయకుడు కృష్ణంరాజు తనయుడిగా తెరంగేట్రం చేసినప్పటికీ తన ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడు జయంత్ తెరకెక్కించిన ఈశ్వర్ సినిమాను కేవలం రూ.1 కోటి బడ్జెట్ తో నిర్మించారు. అప్పట్లో ఈ మూవీ రూ.3.6 కోట్లు వసూలు చేసిందని టాక్. ఈ సినిమాకు ప్రభాస్ రూ.4 లక్షలు మాత్రమే పారితోషికం తీసుకున్నారని సమాచారం. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ హీరోగా తనదైన ముద్ర వేశాడు.
ఎక్కువ మంది చదివినవి : ఏం సినిమా రా బాబూ.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతుంటారు.. 22 సంవత్సరాలుగా బాక్సాఫీస్ కింగ్..
బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఊహించని సంచలనం సృష్టించింది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయిన ప్రభాస్.. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉండిపోయారు. ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.100 నుంచి రూ.150 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. బాహుబలి సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఆ తర్వాత సలార్, కల్కి, రాధేశ్యామ్, ఆది పురుష్ చిత్రాలు ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయినప్పటికీ మంచి వసూళ్లు రాబట్టాయి. ఇక ఇటీవల సంక్రాంతి పండక్కి రాజాసాబ్ చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చారు. భారీ హైప్ మధ్య విడుదలైన ఈ మూవీ సైతం నిరాశ పరిచింది. కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..