
సినీరంగంలో ఆమె అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. దశాబ్దాల పాటు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది. ఇప్పుుడు అలియా భట్, దీపికా పదుకొనే, రష్మిక మందన్నా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం దశాబ్దాలపాటు బాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది. హిందీ సినిమాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇటీవల కల్కి 2898 ఏడీ సినిమా కోసం దీపికా పదుకొనె రూ.20 కోట్లు, పఠాన్ సినిమాకు రూ.15 కోట్లు పారితోషికం తీసుకుంది.
కానీ గత నాలుగేళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఆమె పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్. ప్రస్తుతం ఆమె వయసు 43 సంవత్సరాలు. ఆమెకు కూతురు సైతం ఉంది. కానీ ఇప్పటికీ ఆమె ఒక సిరీస్ కోసం రూ.41 కోట్లు.. సినిమాకు రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఆమె మరెవరో కాదు.. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. ఈరోజు ఆమె పుట్టినరోజు. గతంలో ఆమె అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం నటించిన సిటాడెల్ సిరీస్ కు రూ.41 కోట్లు తీసుకుంది.
ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న SSMB 29 కోసం ప్రియాంక రూ.30 కోట్లు తీసుకుంటుంది. ఇది ఇప్పటివరకు ఏ మహిళ నటికి లభించని అత్యధిక పారితోషికం. ప్రియాంక చోప్రా చివరిసారిగా హిందీలో ది వైట్ టైగర్ చిత్రంలో కనిపించింది. ఇందులో రాజ్ కుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ప్రియాంకకు 92.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే సొంతంగా పర్పుల్ పెబుల్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థకు సహ వ్యవస్థాపకురాలు. నివేదికల ప్రకారం ఆమె ఆస్తులు రూ.650 కోట్లు.
ఇవి కూడా చదవండి :
Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..