Tollywood : డిసెంబర్ నెల ముగ్గురు హీరోలకు కలిసొచ్చింది.. విలన్ పాత్రలతో బాక్సాఫీస్ రూల్ చేసిన నటులు..

డిసెంబర్ నెలలో విడుదలైన సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. కానీ మీకు తెలుసా.. ఈ నెల గత మూడేళ్లల్లో ముగ్గురు హీరోలకు కలిసి వచ్చింది. ఒకప్పుడు హీరోలుగా సక్సెస్ అయి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ఆ నటులు.. ఇప్పుడు విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యారు. ఇంతకీ ఎవరెవరికి సక్సెస్ వచ్చిందో చూద్దామా.

Tollywood : డిసెంబర్ నెల ముగ్గురు హీరోలకు కలిసొచ్చింది.. విలన్ పాత్రలతో బాక్సాఫీస్ రూల్ చేసిన నటులు..
Bobby Deol, Akshaye Khanna

Updated on: Dec 26, 2025 | 2:47 PM

సంవత్సరంలో చివరి నెల డిసెంబర్… అందరూ పార్టీ, వేడుకల మూడ్‌లో ఉంటారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ కొన్ని ప్రత్యేక జ్ఞాపకాలను తెస్తుంది. వినోద ప్రపంచానికి కూడా డిసెంబర్ ఎల్లప్పుడూ ముఖ్యమైన నెల. గత కొన్ని సంవత్సరాలుగా డిసెంబర్ నెల ఇండస్ట్రీకి సూపర్ హిట్ సినిమాలను మాత్రమే కాకుండా గొప్ప విలన్లను కూడా ఇచ్చింది. గత మూడు సంవత్సరాలలో డిసెంబర్‌లో వరుసగా మూడు సినిమాలు విడుదలై భారీ విజయాన్ని అందుకున్నాయి. అలాగే ఈ సినిమాల్లో నటించిన విలన్స్ సైతం పాపులర్ అయ్యారు. డిసెంబర్ 1, 2023న విడుదలైన యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించింది. రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్ర పోషించినప్పటికీ, ఈ సినిమాలో బాబీ డియోల్ పోషించిన విలన్ అబ్రార్ పాత్ర హిట్టైంది. ఈ మూవీలో తనకు డైలాగ్స్ లేకపోయినా.. కేవలం ఎక్స్ ప్రెషన్స్ ఆధారంగానే మెప్పించాడు.

ఆ తర్వాత పుష్ప 2 డిసెంబర్ 5, 2024న విడుదలైంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీలో ఫహద్ ఫాసిల్ పోషించిన విలన్ భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర హైలెట్ అయ్యింది. అతని నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో రూ. 1,642 కోట్లు వసూలు చేసింది.

ఇప్పుడు డిసెంబర్ 2025 లో, ధురంధర్ సినిమా థియేటర్లలో సెన్సేషన్ అవుతుంది. ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించిన విలన్ రెహమాన్ దకైత్ పాత్ర హైలెట్ అయ్యింది. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా ఎంట్రీ సాంగ్ ఇప్పుడు నెట్టింట మారుమోగుతుంది. ఈ మూవీ కొద్ది రోజుల్లోనే 1000 కోట్ల మార్కును దాటింది. ఈ ముగ్గురు హీరోలకు డిసెంబర్ నెల కలిసి వచ్చింది.

ఇవి కూడా చదవండి : 1000కి పైగా సినిమాలు.. సిల్క్ స్మిత కంటే ముందే ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. చివరి రోజుల్లో ఎంతగా బాధపడిందంటే..