
ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుగు సినిమాల వైపు ఆసక్తికరంగా చూస్తుంది. పాన్ ఇండియా సినిమాలకు టాలీవుడ్ పెట్టింది పేరుగా మారింది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి ఒక్కసారిగా ప్రపంచం మొత్తం మారుమ్రోగుతుంది. మన తెలుగు హీరోలందరూ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో పాన్ గ్లోబల్ మూవీ చేస్తున్నాడు. ఏ సినిమా ప్రపంచాన్నిషేక్ చేయడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా కూడాపాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. అలాగే తారక్ కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది.
అలాగే సీనియర్ హీరో వెంకటేష్ కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, వెంకటేష్‌లతో సినిమాలు చేసిన ఏకైక దర్శకుడు ఎవరో తెలుసా.? ఈ స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ దర్శకుడు అతను ఎవరో గుర్తుపట్టారా.? అతను మరెవరో కాదు ఒక్కప్పుడు సూపర్ హిట్ సినిమాలకు పెట్టింది పేరు శ్రీను వైట్ల. ఒకానొక సమయంలో శ్రీను వైట్ల సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది.
తనదైన కామెడీ కంటెంట్ తో సినిమాలు తెరకెక్కించి మెప్పించాడు శ్రీను వైట్ల.. ప్రస్తుతం ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఇక మహేష్ బాబుతో దూకుడు, ఆగడు సినిమాలు చేశాడు శ్రీను వైట్ల, అలాగే ఎన్టీఆర్ తో బాద్షా, వెంకటేష్ తో నమోవెంకటేశాయ, రామ్ చరణ్ తో బ్రూస్ లీ సినిమాలు చేశాడు శ్రీను వైట్ల. చివరిగా ఆయన గోపిచంద్ తో సినిమా చేశాడు. కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..