Prabhas: రాజాసాబ్ పోస్టర్‏లో ప్రభాస్ ధరించిన సన్ గ్లాసెస్ ధర ఎంతో తెలుసా..

Prabhas Birthday: ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కొత్త సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రాజాసాబ్ చిత్రం నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో స్టైలీష్ లుక్ లో కనిపిస్తున్నాడు డార్లింగ్. ముఖ్యంగా ప్రభాస్ ధరించిన సన్ గ్లాసెస్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి.

Prabhas: రాజాసాబ్ పోస్టర్‏లో ప్రభాస్ ధరించిన సన్ గ్లాసెస్ ధర ఎంతో తెలుసా..
Prabhas Poster
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 23, 2024 | 12:45 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో డార్లింగ్ చిన్ననాటి ఫోటోస్, రేర్ పిక్స్ షేర్ చేస్తూ బర్త్ డే విషెస్ చెబుతున్నారు ఫ్యాన్స్. అలాగే ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న రాజాసాబ్ నుంచి ప్రభాస్ కొత్త పోస్టర్ షేర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో స్టైలీష్, కూల్ లుక్ లో కనిపిస్తున్నారు డార్లింగ్. టీ-షర్ట్‌పై చెక్డ్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, ట్రెండీ సన్ గ్లాసెస్ ధరించి ప్రభాస్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇన్నాళ్లు మాస్ లుక్ లో కనిపించిన ప్రభాస్.. ఇప్పుడు స్టైలీష్ లుక్ తో వింటేజ్ డార్లింగ్ ను గుర్తు చేస్తుండడంతో క్షణాల్లోనే ఈ పోస్టర్ నెట్టింట వైరలయ్యింది. పోస్టర్‌లో ప్రభాస్ ధరించిన సన్ గ్లాసెస్ చర్చనీయాంశంగా మారాయి.

ఇవి సాధారణ సన్ గ్లాసెస్ కావు- అవి లూయిస్ విట్టన్ నుండి వచ్చిన విలాసవంతమైన జత. దీని ధర రూ. 88,000. లగ్జరీ ఫ్యాషన్‌లో తన అభిరుచికి పేరుగాంచిన ప్రభాస్ తన స్టైలీష్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మారుతీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తోన్న సినిమా ది రాజా సాబ్. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, సంజయ్ దత్, అనుపమ్ ఖేర్, యోగిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

రాజాసాబ్ సినిమా తర్వాత అనేక ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే సలార్ పార్ట్ 2లో శౌర్యంగ పర్వం లో దేవా పాత్రలో మళ్లీ నటించనున్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన స్పిరిట్‌లో కూడా నటించనున్నాడు. కన్నప్పలో అతని అతిధి పాత్ర కోసం అభిమానులు కూడా ఎదురుచూస్తారు. 2025లో, ప్రభాస్ కల్కి 2898 AD చిత్రంలో నటించనున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.