Nagarjuna : నాగార్జున సరసన బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది.. కట్ చేస్తే.. నాగ చైతన్య కోడలిగా కనిపించిన హీరోయిన్..

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్లుగా చక్రం తిప్పిన తారలు చాలా మంది ఉన్నారు. అప్పట్లో వరుస సినిమాలోత మెప్పించి ఇప్పుడు సహయ నటీమణులుగా వెండితెరపై సందడి చేస్తున్నారు. అందులో మనం మాట్లాడుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒకప్పుడు నాగార్జున సరసన నటించిన ఆమె.. ఆ తర్వాత నాగ చైతన్యకు కోడలిగా నటించింది.

Nagarjuna : నాగార్జున సరసన బ్లాక్ బస్టర్ సినిమాలు చేసింది.. కట్ చేస్తే.. నాగ చైతన్య కోడలిగా కనిపించిన హీరోయిన్..
Nagarjuna, Naga Chaitanya

Updated on: May 23, 2026 | 9:52 AM

సినీ పరిశ్రమలో కొందరు హీరోయిన్లు తమ అందం, అభినయంతో తరాలు మారినా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ కథానాయిక శ్రియ శరణ్ ఒకరు. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం 43 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల అమ్మాయి తరహా ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేస్తూ కుర్రకారును కట్టిపడేస్తోంది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా, కంటెంట్‌ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో తల్లిగానూ నటించి మెప్పించడం శ్రియ ప్రత్యేకత. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణల సరసన శ్రియ అనేక బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా నాగార్జునతో ‘నేనున్నాను’, చిరంజీవితో ‘ఠాగూర్’ వంటి సినిమాల్లో ప్రియురాలిగా నటించి మెప్పించింది. అయితే, ఒకప్పుడు సీనియర్ హీరోల సరసన హీరోయిన్‌గా అలరించిన శ్రియ.. ఆ తర్వాత కాలంలో వారి వారసుల చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించడం విశేషం. ‘RRR’ చిత్రంలో రామ్ చరణ్‌కు తల్లిగా నటించిన ఆమె, అక్కినేని మల్టీస్టారర్ చిత్రం ‘మనం’లో ఒక విభిన్నమైన పాత్రలో కనిపించింది.

ఎక్కువ మంది చదివినవి :  Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..

‘మనం’ సినిమాలో కథా రీత్యా ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంటుంది. ఈ చిత్రంలో నాగార్జునకు భార్యగా శ్రియ నటించింది. అయితే పూర్వజన్మల నేపథ్యంలో సాగే ఈ కథలో నాగార్జునకు తండ్రిగా నాగచైతన్య నటిస్తాడు. ఈ లెక్కన చూస్తే, ‘మనం’ సినిమాలో నాగచైతన్యకు కోడలి పాత్రలో శ్రియ కనిపించిందన్నమాట. ఒకప్పుడు తండ్రి సరసన జోడీ కట్టి, ఆపై కొడుకు పాత్రకు కోడలిగా నటించడం సినిమా రంగంలో చాలా అరుదుగా జరిగే విశేషం.

ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న శ్రియ, ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోంది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ, గ్లామరస్ ఫోటోషూట్లతో నెటిజన్లను అలరిస్తోంది. వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ శ్రియ సాగిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఎక్కువ మంది చదివినవి : Soundarya: సౌందర్య భర్త ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. హీరోయిన్ ప్రేమ కామెంట్స్..

శ్రియా శరణ్ ఇన్ స్టా పోస్ట్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్ అయ్యింది.. ఇప్పుడు ఇలా..

Follow Us