
ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్స్ తమదైన ముద్ర వేశారు. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.. ? సౌత్ ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్. దాదాపు 24 సంవత్సరాలుగా వరుస సినిమాలతో స్టా్ర్ డమ్ సంపాదించుకుంది. కఠోర శ్రమ, ప్రతిభతో బలమైన గుర్తింపును సంపాదించుకున్న త్రిషా కృష్ణన్ అలాంటి పేర్లలో ఒకరు. ఆమె ఒకప్పుడు క్రిమినల్ సైకాలజిస్ట్ కావాలని కలలు కన్నారు, కానీ జీవితం ఆమె కోసం వేరే ప్రణాళికలు వేసింది. సినిమాల్లోకి రాకముందు, త్రిషా కృష్ణన్ క్రిమినల్ సైకాలజిస్ట్ కావాలనుకున్నారు. ఆ తర్వాత చెన్నైలో పాఠశాల విద్యను పూర్తి చేశాక ఆమె బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదివారు.
ఎక్కువ మంది చదివినవి : Vijay Thalapathy : ఆ ఒక్క సినిమా విడుదల కాకపోయి ఉంటే విజయ్, సంగీత పెళ్లి అయ్యేదే కాదు.. తలపతి కెరీర్ మార్చిన ఏకైక మూవీ..
ఆమె తన కళాశాల రోజుల్లో మోడలింగ్ ప్రారంభించి, అనేక ప్రకటనలలో కనిపించి, నెమ్మదిగా వినోద ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 1999లో, ఆమె మిస్ మద్రాస్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె జీవితం మలుపులు తిరిగింది. ఆమె చిన్న పాత్రలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ, త్వరలోనే గుర్తింపు పొంది తమిళ, తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయికగా నిలదొక్కుకుంది. త్రిష బాలీవుడ్‌తో సహా పలు భాషల్లో పనిచేసి, అనేక విజయవంతమైన చిత్రాలను అందించింది.
ఎక్కువ మంది చదివినవి : Raghavendra Rao: 83 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‌గా.. ఆరోగ్యంగా.. రోజూ ఉదయాన్నే తినేది ఇవే.. రాఘవేంద్రరావు..
ఆమె ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఒక్కో ప్రాజెక్టుకు రూ. 10-12 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. సుమారు రూ. 85-100 కోట్ల ఆస్తి విలువ కలిగిన ఆమెకు చెన్నై , హైదరాబాద్‌లలో విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు త్రిష పేరు వార్తలలో మారుమోగుతుంది. అందుకు కారణం విజయ్ తలపతితో ఆమెకున్న స్నేహమే. త్వరలోనే ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రచారం నడుస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Meena : తెలుగు సినిమాల్లో నాకు గుర్తింపు రావడానికి ఆ హీరోనే కారణం.. లేదంటే నేను లేను.. మీనా కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Jaya Prada : నటనకే నటన నేర్పిన మహా నటుడు అతడు.. అలాంటి హీరోను ఎక్కడా చూడలేదు.. హీరోయిన్ జయప్రద..