Salaar Movie: వామ్మో “కాటేరమ్మ” దేవత వెనక ఇంత కథ ఉందా..? చదివితేనే వణుకొస్తుందిగా..
హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ కు చాలా కాలం తర్వాత సరైన సినిమా పడిందంటూ అభిమానులు అనుకుంటున్నారు. ఇక సలార్ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. వాటిలో కాటేరమ్మ ఫైట్ ఒకటి.

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా సంచలన విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ కొంతం చేసుకొని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ కు చాలా కాలం తర్వాత సరైన సినిమా పడిందంటూ అభిమానులు అనుకుంటున్నారు. ఇక సలార్ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. వాటిలో కాటేరమ్మ ఫైట్ ఒకటి. ఈ ఫైట్ థియేటర్స్ లో విజిల్స్ కొట్టించింది.”కాటేరమ్మ రాలేదు కానీ, బదులుగా కొడుకుని పంపింది అమ్మ” అనే డైలాగ్
అయితే సాలార్ సినిమాలో చూపించిన కాటేరమ్మ దేవత ఎవరు.? ఆమెకు ఆ పేరు ఎలా వచ్చింది అన్నది చాలా మందికి తెలియదు. కైలాసంలో పరమ శివుడు నిద్రపోయే సమయంలో పార్వతి దేవి ఎక్కడికో వెళ్తూ ఉండేదట.. ప్రతి రోజూ రాత్రి సమయంలో వెళ్లి, సూర్యోదయం కాకముందే కైలాసానికి తిరిగి వచ్చేదట పార్వతి. అది గమనించిన శివుడు పార్వతీదేవిని నిలదీశాడట. అయితే తనకు తెలియకుండానే అలా జరిగుతోందని చెప్పిందట పార్వతి.
ఓ రోజు పార్వతీదేవిని శివుడు అనుసరించాడట. ఆమె అడవులగుండా వెళ్తూ కనిపించిందట. అయితే ఆమె ఒక్కసారిగా కాళికా రూపంలోకి మారి పాతిపెట్టిన శవాలని బయటకు తీసి తినే ప్రయత్నం చేసిందట. దాంతో శంకరుడు ఉగ్ర రూపంలోని పార్వతిదేవిని ఆపడానికి ఆమె వెళ్లే మార్గంలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడట. దాంతో ఆమె అందులో పడిపోతుందట. దాంతో ఆమె తేరుకొని చేసినదానికి పశ్చాత్తాపం పడుతుంది. ఆతర్వాత ఆ ఉగ్రరూపాన్ని వదిలి పార్వతీదేవిగా శివుడి వెంట వెళ్లిపోతుందట. ఆమె వదిలిన ఆ ఉగ్రరూపమే కాటేరమ్మ దేవత అని చెప్తుంటారు. కర్ణాటకలో కాటేరమ్మగా, తమిళనాడులో కాటేరీ అమ్మన్‌గా ఈ దేవత పూజలందుకుంటూ ఉంటుంది. చాలా మంది కాపలా దేవతగా, కొన్ని ప్రాంతాల్లో కులదేవతగా కాటేరమ్మ ను కొలుస్తుంటారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




