Kiran Abbavaram: చిన్న హీరోకు పెద్ద ఆఫర్.. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్‌లో కిరణ్ అబ్బవరం మూవీ.. టైటిల్ ఏంటంటే..

|

Jan 07, 2022 | 4:34 PM

రాజావారు రాణీగారు సినిమాతో హీరోగా వెండితెరకేయూ పరిచయం అయ్యాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. విభిన్న కథలను ఎంచుకుంటున్నారు.

Kiran Abbavaram: చిన్న హీరోకు పెద్ద ఆఫర్.. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్‌లో కిరణ్ అబ్బవరం మూవీ.. టైటిల్ ఏంటంటే..
Kiran Abbavaram
Follow us on

Kiran Abbavaram: రాజావారు రాణీగారు సినిమాతో హీరోగా వెండితెరకేయూ పరిచయం అయ్యాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. విభిన్న కథలను ఎంచుకుంటున్నారు. మెద‌టి చిత్రం ‘రాజా వారు రాణి గారు’ రస్టిక్ అండ్ రొమాంటిక్ డ్రామా కాగా.. రెండో చిత్రం ఎస్ఆర్ కళ్యాణమండపం రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఆ రెండూ కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ `సమ్మతమే’ అంటూ అర్బన్ బ్యాక్ డ్రాప్‌తో రాబోతోన్నారు. ఈ సినిమాను గోపీనాథ్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు ఈ కుర్ర హీరో. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను ప్రోత్సహిస్తుంది గీత ఆర్ట్స్. గీతా ఆర్ట్స్ సంస్థకు అనుబంధంగా ‘గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్’ అనే మరో బ్యానర్ ను ఏర్పాటు చేసి యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు అల్లు అరవింద్. ఇప్పుడు గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ లో సినిమా చేస్తున్నాడు కిరణ్. తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలతో మొదలైంది.

అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించే ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా పూజాకార్యక్రమాలను నిర్వహించారు. ఈ సినిమా ”వినరో భాగ్యము విష్ణు కథ” అనే ఇంట్రస్టింగ్  టైటిల్ ను ఖరారు చేశారు. కిరణ్ సరసన కశ్మీరా పర్దేశీ హీరోయిన్ గా నటిస్తోంది. ‘నర్తనశాల’ సినిమాతో పరిచయం అయ్యింది కశ్మీరా. ఇక ఈ సినిమా గురించి కిరణ్ ట్విట్టర్ లో స్పందిస్తూ..”వారి సినిమాలు చూడటం నుండి అందులో భాగం కావడం అనేది నా పెద్ద కలలలో ఒకటి. నన్ను నమ్మినందుకు అల్లు అరవింద్ సార్ మరియు బన్నీ వాస్ గారికి ధన్యవాదాలు” అని రాసుకొచ్చాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pushpa Sami Song: బన్నీ ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చిన పుష్ప టీమ్‌.. ‘సామి సామి’ వీడియో సాంగ్‌ వచ్చేసింది..

Hyderabad: సినీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మల్టిప్లెక్స్ థియేటర్లలో తగ్గిన సినిమా టికెట్ ధరలు.. ఎప్పటి నుంచి అంటే..

SS Thaman: సినిమా పరిశ్రమపై కరోనా పంజా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌కు పాజిటివ్‌..