Kichcha Sudeepa : తెలుగు ప్రేక్షకులకు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సుదీప్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకులను పలకరించబోతోన్నారు. శివ కార్తీక్ దర్శకత్వంలో సుదీప్ కే3 కోటికొక్కడు అనే సినిమాను చేశారు. కన్నడలో కే 3 చిత్రం విడుదలైంది. కన్నడ పరిశ్రమ ట్రేడ్ లెక్కల ప్రకారం రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు చేసి సుదీప్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని నవంబర్ 12న తెలుగులో విడుదలచేయనున్నారు.
ఈ క్రమంలోనే కే3 కోటికొక్కడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. విదేశాల్లో బాంబ్ బ్లాస్ట్ జరగడం, మీడియా అంతా కూడా ఘోస్ట్ గురించి ప్రస్థావించడం, ఆ బాంబ్ బ్లాస్ట్‌లో దాదాపు 40 మంది క్రిమినల్స్ చనిపోతారు. ఇక ఇంటర్ పోల్ అధికారి అప్తబ్ శివ్ధసాని ఘోస్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటాని శపథం చేస్తాడు. ఇక సుదీప్ ఎంట్రీ కచ్చితంగా విజిల్స్ పడేలా ఉంది. మడోన్నా సెబాస్టియన్ సుదీప్ జోడికి అందరూ ఫిదా అవుతారని అర్ధమవుతుంది. ఈ ట్రైలర్‌లో శ్రద్దా దాస్, రవి శంకర్, నవాబ్ షా తదితరులు కనిపించారు. ఈ ట్రైలర్ మొత్తంగా అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మరీ ముఖ్యంగా యాక్షన్ మూవీ లవర్స్‌ను కచ్చితంగా అలరిస్తుందని తెలుస్తోంది. కే3 కోటికొక్కడు తెలుగు ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇక గుడ్ సినిమా గ్రూప్ సంస్థ కే3 కోటికొక్కడు చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
మరిన్ని ఇక్కడ చదవండి :